వైరల్: జనసేన వీరాభిమాని చేసిన పని తెలిస్తే !

Update: 2022-05-02 14:30 GMT
పార్టీ కోసం ప్రాణమిచ్చే కార్యకర్తలు ఉంటారు. కానీ జనసైనికులు అంతకుమించి అని తేలింది. చాలా మంది పవన్ అంటే పడిచస్తారు.కానీ జనసైనికులు మాత్రం ప్రాణం పెట్టి పనిచేస్తారు. పార్టీ కోసం పాటుపడుతారు. పవన్ ఒక్క ఆదేశం ఇస్తే వెల్లువలా ఉరుకుతారు.

చాలా మంది అభిమానులు పవన్ పై.. జనసేనపై తమదైన రూపాల్లో అభిమానం చాటుతూనే ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనపై ప్రేమతో తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన కోటే హరీష్ బాబు అనే జనసైనికులు ఏకంగా తన పెళ్లినే ప్రచారానికి వాడేశాడు.

కోటే హరీష్ బాబు జనసేన లీగల్ సెల్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈనెల 4న ఆయన వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంగా హరీష్ బాబు తన వివాహ శుభలేఖలో పైభాగంలో జనసేన పార్టీ మేనిఫెస్టో, గుర్తు, పవన్ ఫొటోలను ముద్రించాడు. శుభలేఖ కింది భాగంలో పెళ్లి ముహూర్తం వివరాలను తెలియజేశాడు.

పవన్ కళ్యాణ్ అంతే తనకు ప్రాణమని.. ఆయన సిద్ధాంతాలు తనకు ప్రేరణ కలిగించాయని కోటే హరీష్ బాబు పేర్కొన్నాడు. అందుకే తన పెళ్లిని సైతం జనసేన ప్రచారానికి వాడుకున్నానని వివరించాడు.

జనసేన మేనిఫెస్టోతో ముద్రించిన ఈ శుభలేక జనసేన అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Tags:    

Similar News