గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. అయితే వరప్రసాద్ గత కొంతకాలంగా వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇప్పటికే అనేకసార్లు అసెంబ్లీలో సీఎం జగన్మోహన్రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన వైసీపీ ఎమ్మెల్యేగానే ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని అర్థం కాక జనసేనాని తికమక పడుతున్నారు. ఇప్పటికే పలుసార్లు జనసేన అధినేతను ఆయన విమర్శించారు.
నిజానికి రాపాక వరప్రసాద్ మొదట వైసీపీలో ఉండేవారు. అయితే ఆయనకు రాజోలు టికెట్ దక్కకపోవడంతో జనసేన టికెట్‌తో గెలుపొందారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయన వైసీసీ నేతలకు దగ్గరయ్యారు. మరోవైపు ఆయన కుమారుడు సీఎం జగన్ సమక్షంలో వైసీసీ కండువా కప్పుకున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాపాక.. ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను వైసీపీ కార్యకర్తను. వైసీపీ ఎమ్మెల్యేనే. ఈ విషయంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ఇబ్బంది ఏమిటి?’ అంటూ ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మరోవైపు కొంతకాలంగా రాపాక వరప్రసాద్‌పై జనసేన సోషల్‌మీడియా తీవ్రంగా విరుచుకుపడుతున్నది. జనసేన ఫేస్బుక్ గ్రూపుల్లో రాపాక వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. గ్లాసు గుర్తుపై గెలుపొంది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయడం ఏమిటని సోషల్‌మీడియా జనసైనికులు పోస్టులు పెడుతున్నారు.