ఏపీలో జనసేన మూడవ ఆల్టర్నేషన్ గా ఎమర్జ్ అయ్యేది 2024లోనా లేక 2029లోనా అన్న దాని మీద ఎవరి రాజకీయ విశ్లేషణలు వారికి ఉన్నాయి. ఏపీలో ఇపుడు ఉన్న రాజకీయ ముఖ చిత్రం చూస్తే జనసేనకు స్కోప్ అనుకున్నంతగా ఉండదని అంటున్నారు. ఎందుకంటే అధికార వైసీపీ బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 అన్న నినాదంతో ఉంది. ఇక తెలుగుదేశం కార్యకర్తలు అధికంగా పటిష్టంగా ఉన్న పార్టీ. ఈ రెండు పార్టీలను ఢీ కొట్టి నంబర్ వన్ పొజిషన్ లోకి జనసేన రావడం అంటే 2024 ఎన్నికలలో సమయం అసలు సరిపోదు అనే అంటున్నారు.
ఆ విషయం బయట వారిలో ఎలా ఉన్నా అంతర్గతంగా జనసేనలోనూ చర్చగా ఉంది అంటున్నారు. తమ సొంత బలం ఏంటో కచ్చితమైన అంచనా వేసుకునే జనసేన 2024 ఎన్నికల్లో పొత్తులు ఉన్నా లేకపోయినా పాతిక నుంచి ముప్పయి సీట్లు సాధించాలని గట్టిగా నిర్ణయించుకుంది అని అంటున్నారు. ఏపీలో జనసేనకు 175 సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్ధులు లేరు. బలం కూడా ఇప్పటికిపుడు లేదు, రావడం కష్టం. ఏపీలో రెండు ప్రధాన పార్టీలలో ఒక పార్టీ కుదేల్ అయితే ఆ విధంగా పొలిటికల్ స్పేస్ ఏర్పడితేనే ఏపీలో జనసేనకు నిలదొక్కుకునే చాన్స్ వస్తుంది.
దాంతో జనసేన కూడా రియాల్టీని గమనించి ఆ దిశగా అడుగులు వేస్తోంది అని అంటున్నారు. ఏపీలో చూస్తే జనసేనకు గోదావరి జిల్లాలలో మంచి పట్టుంది. ఆ తరువాత ఉత్తరాంధ్రా జిల్లాలలో చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలతో పాటు, విజయవాడ, గుంటూరు.. కర్నూలు, అనంతపురం జిల్లాలు ఉన్నాయని అంటున్నారు.
ఇలా ఈ జిల్లాలలో పట్టు సాధించి తమ బలాన్ని పెంచుకుని కనీసం ముప్పయి సీట్లతో అసెంబ్లీలో అడుగుపెట్టి తామేంటో రానున్న అయిదేళ్లలో రుజువు చేసుకుంటే కనుక 2029 నాటికి తమకు అంతా అనుకూలం అవుతుంది అని నమ్ముతున్నారని అంటున్నారు.
మరో వైపు చూస్తే తెలుగుదేశంతో పొత్తులు ఉంటే కనుక నలభై సీట్లకు జనసేన డిమాండ్ చేస్తుంది అని అంటున్నారు. అందులో కచ్చితంగా ముప్పయికి తక్కువ లేకుండా గెలుస్తామన్న అంచనా ఆ పార్టీకి ఉందిట. అదే విడిగా పోటీ చేసినా గతంలో వచ్చిన ఓట్ల శాతాన్ని ఈసారి భారీగా పెంచుకుంటామని,అలాగే సీట్లు కూడా పాతికకు తక్కువ కాకుండా వస్తాయని పార్టీ ఊహిస్తోంది అని అంటున్నారు.
మరి జనసేనలో ఈ రకమైన చర్చలు సాగుతున్నాయనుకుంటే మాత్రం అది పార్టీ రేపటి ప్రగతికి మంచిదే. అందుకే పవన్ కళ్యాణ్ 2024 నుంచి 2029 దాకా అంటూ ఆ మధ్యన మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో చెప్పారని అంటున్నారు. నిజానికి ఇదంతా గుసగుసల మాదిరిగానే ప్రచారం రూపంలో ఉంది తప్ప జనసేన శిబిరంలో కరెక్ట్ గా ఏమి జరుగుతోంది అన్నది మాత్రం తెలియదు అంటున్నారు. మొత్తానికి జనసేన వ్హ్యూహం ఏంటి అన్నది సరైన సమయంలోనే బయటపడుతుంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.