ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆకాశానికెత్తేశారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. శాసనసభలో రాపాక తన ప్రసంగంలో ముఖ్యమంత్రిని ప్రశంసించారు. గంగపుత్రుల-జాలర్ల విషయంలో జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను, వారి కోసం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను రాపాక మనస్ఫూర్తిగా అభిమానించారు.
ఆ మేరకు ఆయన శాసనసభలో ప్రసంగించారు. జాలర్ల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలను రాపాక కొనియాడారు. సముద్రం మీద వేటకు వెళ్లే జాలర్ల కు అనేక రకాలుగా ప్రమాదాలు పొంచి ఉంటాయి. అలాంటి వారికి జరగరానిది జరిగితే, వారి కుటుంబాలను ఆదుకోవడానికి పది లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది ప్రభుత్వం.
ఈ విషయాన్ని రాపాక ప్రస్తావించారు. మత్స్యకార కుటుంబాలకు కుటుంబాలకు జగన్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు అభినందనీయమని రాపాక అన్నారు. ఆ సందర్భంగా ఒక ఆసక్తిదాయకమైన వ్యాఖ్య చేశారాయన.
''కోరిన కోర్కెలు తీర్చేది గంగమ్మ తల్లి అయితే కోరని కోరికలను కూడా తీర్చే వారే జగన్మోహన్ రెడ్డి గారు..'' అంటూ రాపాక వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో సభలో ఆసక్తిదాయకమైన వాతావరణం ఏర్పడింది. రాపాక వ్యాఖ్య విని ముఖ్యమంత్రి నవ్వుకోగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తూ పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.