గ్లాస్ గుర్తుకు ఎలాంటి ఢోకా లేదట‌!

Update: 2019-03-29 05:33 GMT
అదిగో తోక అంటే ఇదిగో పులి అన్న మాట‌లు మామూలే. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ ఎత్తుల్లో భాగంగానే చాలానే మాట‌లు వినిపిస్తూ ఉంటాయి. ఇక‌.. పోటీ తీవ్రంగా ఉన్న‌ప్పుడు గాలి ప్ర‌చారాల‌కు కొద‌వ ఉండ‌దు. ఇప్పుడు ఏపీకి సంబంధించి అలాంటి ప్ర‌చారాలు రోజుకు ఒక‌టి చొప్పున తెర మీద‌కు వ‌స్తున్నాయి.

ఎవ‌రుపుట్టిస్తున్నారో.. ఎక్క‌డ స్టార్ట్ చేస్తున్నారో అర్థం కావ‌టం లేదు కానీ.. వైర‌ల్ గా మారుతున్న అనుమానాల‌కు స‌మాధానాలు చెప్ప‌టానికి పార్టీలు కిందా మీదా ప‌డుతున్నాయి. తాజాగా అలాంటి అనుభ‌వ‌మే జ‌న‌సేన పార్టీకి ఎదురైంది. పార్టీకి ఎన్నిక‌ల సంఘం కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును మారుస్తున్న‌ట్లుగా ప్ర‌చారం మొద‌లైంది. ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చే లోపే.. ఇది మ‌రింత వైర‌ల్ కావ‌టంతో.. గుర్తు విష‌యంపై పార్టీ అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

ఎన్నిక‌ల సంఘం జ‌న‌సేన పార్టీకి ఇచ్చిన గాజు గ్లాస్ గుర్తులో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేద‌ని.. ఆ గుర్తు పార్టీతోనే ఉంద‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి హ‌రిప్ర‌సాద్ తాజాగా ఒక ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌క‌టించారు. జ‌న‌సేన ఎన్నిక‌ల గుర్తు గాజుగ్లాస్ అన్న విష‌యాన్ని ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త గుర్తించాల‌ని.. ఈ గుర్తును ఎన్నిక‌ల సంఘం ర‌ద్దు చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇవ‌న్నీ ఉత్త ప్ర‌చారాలేన‌ని.. టెన్ష‌న్ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు. 

పార్టీ నేత‌ల సంత‌కాల్ని ఫోర్జ‌రీ చేసి సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని.. దుష్ట‌శ‌క్తుల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. జ‌న‌సేన శ్రేణుల్లో గంద‌ర‌గోళం సృష్టించేందుకు ఈ త‌ర‌హా ప్ర‌చారాన్ని చేస్తుంటార‌ని.. అందువ‌ల్ల కార్య‌క‌ర్త‌లంతా అప్ర‌మ‌త్త‌తో వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. పార్టీకి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లు పార్టీ మీడియా విభాగం నుంచి మాత్ర‌మే విడుద‌ల‌వుతాయ‌ని.. ఏదైనా ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసిన వెంట‌నే ఫేస్ బుక్.. ట్విట్ట‌ర్ అధికారిక ఖాతాల్లోనూ పోస్ట్ చేయ‌టం జ‌రుగుతుంద‌న్నారు.
Tags:    

Similar News