రాజకీయ రణస్థలంలో పవన్ యువ తడాఖా..!

Update: 2023-01-02 23:30 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఏ పార్టీకి లేనంతమంది యూత్ ఫ్యాన్స్ ఉంటారు. యువత ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే రాజకీయ పార్టీగా జనసేనను చెప్పుకుంటారు. పవన్ వస్తే ఆయన సభలకు నూటికి తొంబై శాతం హాజరు అయ్యేది యువతరమే. అలాంటి యువతను మరింతగా పటిష్టం చేస్తూ తమ వైపునకు తిప్పుకునేందుకు జనసేన తలపెట్టిన ఒక పెద్ద కార్యక్రమమే యువ శక్తి. ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సమావేశాన్ని పవన్ నిర్వహిస్తున్నరు.

ఉత్తరాంధ్రా గడ్డ మీద రాజకీయ రణ స్థలం వేదికగా పవన్ చేపడుతున్న యువ శక్తి మీటింగ్ మీద అపుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సమావేశం ద్వారా ఏపీలో అత్యధిక శాతం ఉన్న యువజనానికి పవన్ ఒక కీలక సందేశం పంపించనున్నారు అని అంటున్నారు. రేపటి రోజున ఆంధ్రప్రడేశ్ లో భవిష్యత్తు గా ఉన్న అతి పెద్ద మానవ వనరుగా ఉన్న యువ శక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నది, అలాగే జనసేన అధికారంలోకి వస్తే వారిని ఏ విధంగా ప్రోత్సహిస్తామన్నది పవన్ చెప్పబోతున్నారు.

తన పార్టీ యువజన ప్రణాళికను కూడా ఆయన విడుదల చేస్తారు అని అంటున్నారు. జనవరి 12 స్వామీ వివేకానందుని జయంతి. యువజనోత్సవం ఆ రోజుని స్పూర్తిగా తీసుకుని యువశక్తిని నిర్వహించాలనుకోవడం జనసేన వ్యూహాన్ని తెలియచేస్తోంది. యువశక్తి సదస్సుకు సంబంధించిన గోడ పత్రికను పవన్ తాజాగా హైదరాబాద్ లో ఆవిష్కరించారు. పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్, మెగా బ్రదర్ నాగబాబు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రాలో వలసలు ఎక్కువ అని, ఉపాధి లేకుండా ఉంటుందని, అలాగే విద్యావకాశాలు లేవు, వ్యాపార అవకాశాలు లేవు వీటి మీద యువ శక్తి సదస్సులో చర్చిస్తామని చెప్పారు. యువకులు అంతా ఈ సదస్సుకు ఆహ్వానితులే అని ఆయన అన్నారు. యువత మన భవిత అన్నదే తమ నినాదమని చెప్పారు.

ఈ సదస్సుని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఇక పవన్ కళ్యాణ్ ఒక పద్ధతి ప్రకారం ఉత్తరాంధ్రాలో పార్టీని విస్తరించే పనిలో ఉన్నారు. విశాఖలో కార్యక్రమాలతో పాటు నవంబర్ లో విజయనగరం జిల్లా టూర్ కి వెళ్లారు. ఇక కొత్త ఏడాది ఆయన శ్రీకాకుళం టూర్ పెట్టుకున్నారు. జనసేనకు ఉత్తరాంధ్రాలో మంచి అభిమానగణం ఉంది. వారిని ఆకట్టుకోవడంతో పాటు ఉత్తరాంధ్రాలో పార్టీని పటిష్టం చేసుకుంటే రానున్న కాలంలో రాజకీయగ్నా లాభిస్తుంది అన్న కచ్చితమైన అజెండాతోనే ఆయన యాక్షన్ ప్లాన్ ని రెడీ చెశారు అని అంటున్నారు. ఇక జనవరి 12న యువ శక్తితో పవన్ తడాఖా ఏంటో చూపిస్తారు అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఏ పార్టీకి లేనంతమంది యూత్ ఫ్యాన్స్ ఉంటారు. యువత ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే రాజకీయ పార్టీగా జనసేనను చెప్పుకుంటారు. పవన్ వస్తే ఆయన సభలకు నూటికి తొంబై శాతం హాజరు అయ్యేది యువతరమే. అలాంటి యువతను మరింతగా పటిష్టం చేస్తూ తమ వైపునకు తిప్పుకునేందుకు జనసేన తలపెట్టిన ఒక పెద్ద కార్యక్రమమే యువ శక్తి. ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సమావేశాన్ని పవన్ నిర్వహిస్తున్నరు.

ఉత్తరాంధ్రా గడ్డ మీద రాజకీయ రణ స్థలం వేదికగా పవన్ చేపడుతున్న యువ శక్తి మీటింగ్ మీద అపుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సమావేశం ద్వారా ఏపీలో అత్యధిక శాతం ఉన్న యువజనానికి పవన్ ఒక కీలక సందేశం పంపించనున్నారు అని అంటున్నారు. రేపటి రోజున ఆంధ్రప్రడేశ్ లో భవిష్యత్తు గా ఉన్న అతి పెద్ద మానవ వనరుగా ఉన్న యువ శక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నది, అలాగే జనసేన అధికారంలోకి వస్తే వారిని ఏ విధంగా ప్రోత్సహిస్తామన్నది పవన్ చెప్పబోతున్నారు.

తన పార్టీ యువజన ప్రణాళికను కూడా ఆయన విడుదల చేస్తారు అని అంటున్నారు. జనవరి 12 స్వామీ వివేకానందుని జయంతి. యువజనోత్సవం ఆ రోజుని స్పూర్తిగా తీసుకుని యువశక్తిని నిర్వహించాలనుకోవడం జనసేన వ్యూహాన్ని తెలియచేస్తోంది. యువశక్తి సదస్సుకు సంబంధించిన గోడ పత్రికను పవన్ తాజాగా హైదరాబాద్ లో ఆవిష్కరించారు. పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్, మెగా బ్రదర్ నాగబాబు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రాలో వలసలు ఎక్కువ అని, ఉపాధి లేకుండా ఉంటుందని, అలాగే విద్యావకాశాలు లేవు, వ్యాపార అవకాశాలు లేవు వీటి మీద యువ శక్తి సదస్సులో చర్చిస్తామని చెప్పారు. యువకులు అంతా ఈ సదస్సుకు ఆహ్వానితులే అని ఆయన అన్నారు. యువత మన భవిత అన్నదే తమ నినాదమని చెప్పారు.

ఈ సదస్సుని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఇక పవన్ కళ్యాణ్ ఒక పద్ధతి ప్రకారం ఉత్తరాంధ్రాలో పార్టీని విస్తరించే పనిలో ఉన్నారు. విశాఖలో కార్యక్రమాలతో పాటు నవంబర్ లో విజయనగరం జిల్లా టూర్ కి వెళ్లారు. ఇక కొత్త ఏడాది ఆయన శ్రీకాకుళం టూర్ పెట్టుకున్నారు. జనసేనకు ఉత్తరాంధ్రాలో మంచి అభిమానగణం ఉంది. వారిని ఆకట్టుకోవడంతో పాటు ఉత్తరాంధ్రాలో పార్టీని పటిష్టం చేసుకుంటే రానున్న కాలంలో రాజకీయగ్నా లాభిస్తుంది అన్న కచ్చితమైన అజెండాతోనే ఆయన యాక్షన్ ప్లాన్ ని రెడీ చెశారు అని అంటున్నారు. ఇక జనవరి 12న యువ శక్తితో పవన్ తడాఖా ఏంటో చూపిస్తారు అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News