ఈ ఏడాది చివరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జనసేన అధినేత దృష్టి పెట్టారా? అక్క డ కూడా చక్రం తిప్పాలని ఆయన భావిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ విషయం.. ఇతర పార్టీల కంటే కూడా టీడీపీలోను, వైసీపీలోను ఎక్కువగా చర్చకు వస్తోంది. దీనికి కారణం... వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు. అయితే.. అదే సమయంలో తెలంగాణ లోనూ దృష్టి పెట్టడం..ఈ రెండు పార్టీలనూ.. చర్చకు దారితీసేలా చేశాయి.
ఇక, తెలంగాణలో నిజానికిజనసేనకు ఒక నిర్మాణం అంటూ ఏమీ లేదు. కనీసం ఏపీలో అయినా.. ఒక రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ ఉన్నాడు. అదేసమయంలో కొందరు పార్టీ నాయకులు కూడా ఉన్నారు. కానీ, తెలంగాణలో మాత్రం అంతా శూన్యం. మరి అలాంటి చోట కూడా.. 32 స్థానాలపై పవన్ దృష్టి పెట్టారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ.. తెలంగాణలో ఉందా? అనే ప్రశ్న వస్తోంది.
ఇప్పటికే తెలంగాణ బీజేపీ నాయకులు పవన్ వైఖరిపై గుస్సాగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమను కాదని.. కేసీఆర్‌కు మద్దతివ్వడం దగ్గర నుంచి పవన్‌ను దూరం పెట్టారు. సో.. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ తెలంగాణలో పవన్ పొత్తులో లేరు.
సో.. ఆయన ఎవరితో పొత్తు పెట్టుకుంటారనేది ఒక ప్రశ్న. మరోవైపు.. టీడీపీ నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు. ఏపీలో ఎలానూ పొత్తు పెట్టుకుంటానని పవన్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలోనూ పొత్తు పెట్టుకుంటే.. బెటర్ అనేది వారి సూచన.
తెలంగాణలోనూ టీడీపీ బలోపేతం కావాలని.. అక్కడ కూడా ఉద్యమించాలని.. అదేవిధంగా అక్కడ కూడా ప్రధాన ప్రతిపక్షం స్థాయికి చేరాలని.. నాయకులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే జనసేన తమతో కలిసి వస్తుందనే ఆశలతో ఉన్నారు.
దీనిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని అంటున్నారు. ఒకవేళ తెలంగాణలో పొత్తు పెట్టుకోకపోతే.. పవన్ ఒంటరి పోరు చేస్తారనే ప్రచారం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.