మీకో చిన్న ప్రశ్న. కాస్త ఆలోచించుకొని సమాధానం చెప్పండి. క్షణం తీరిక లేకుండా ఉంటున్న ఈ రోజుల్లో.. మీ టైంలో నుంచి వంద గంటలు ఏదైనా అంశం మీద ఫోకస్ చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తాయి? అంత సమయం ఖాళీగా దొరికితే మీరేం చేస్తారు? ఎవరి సమాధానం వారికి తెలిసిందే. ఇప్పుడు మీ సమాధానాన్ని కాస్త పక్కన పెట్టేసి.. ఇలాంటి ప్రశ్నే ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకెర్ బర్గ్ ను అడిగితే.. ఆయన చెప్పిన సమాధానం వింటే షాక్ తినాల్సిందే.
వివిధ పనుల్లో మనమే ఎంత బిజీగా ఉంటామో తెలిసిందే. అలాంటిది ఫేస్ బుక్ అధిపతి మరెంత బిజీగా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఆయన.. తనకు లభించిన ఖాళీ సమయాల్లో వంద గంటల్ని ఒక అంశం మీద ఫోకస్ చేశారట. దానికి ప్రతిరూపమే.. ‘‘జార్విన్’’. జుకెర్ న్యూ బ్రెయిన్ ఛైల్డ్ గా చెప్పే ఈ టెక్నాలజీని తాజాగా ఆయన ఆవిష్కరించారు.
పాటల్ని ఎంపిక చేయటం.. ఒక దాని తర్వాత మరొకటి వచ్చేలా చేయటం.. ఇంట్లో కరెంటు బల్బుల్ని వెలిగించటం.. గెస్ట్ లు వస్తే వారి ముఖాల్ని గుర్తించి తలుపులు తీయటం లాంటి పనుల్ని చక్కగా చేసే కృత్రిమ మేథస్సును ఆయన రూపొందించారు. ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఐరన్ మ్యాన్ సినిమాల్లో కనిపించే కృత్రిమ మేధస్సుగా చెప్పొచ్చు. తాను తయారు చేసిన జార్విన్ తన ఇంట్లో పనుల్ని చక్కగా చేసేస్తుందని చెప్పాడు.
అయితే.. జార్విన్ కుకొత్త విషయాలు నేర్పించటం మాత్రం సాధ్యం కాదని చెప్పాడు. అదే సమయంలో మరింత ఆసక్తికరమైన విషయాన్ని చెబుతూ.. మనిషికి.. కృత్రిమ మేధస్సుకు మధ్యనున్న వ్యత్యాసాన్ని తనదైన శైలిలో చెప్పేశారు. వంద గంటల్లోనే కృత్రిమ మేధస్సుతో తాను చెప్పిన పనిని చేసే టెక్నాలజీని తయారు చేశానని.. కానీ.. వెయ్యి గంటలు ఖర్చు చేసినా.. తనకు తానుగా నేర్చుకునే కృత్రిమ మేధస్సును మాత్రం సిద్ధం చేయలేనని చెప్పుకొచ్చారు. మనిషికి.. యంత్రుడికి మధ్యనున్న వ్యత్యాసాన్ని జుకెర్ ఎంత బాగా చెప్పారో కదా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/