తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంటే ఉచిత పథకాలకు పెట్టింది పేరు. తమిళనాడు ప్రజల ఇళ్లలో ప్రతి వస్తువుపైనా అమ్మ బొమ్మే ఉంటుంది. ఫ్యాను - మిక్సీ - గ్రైండర్ - బర్రె - సైకిల్ - స్కూటీ - ల్యాప్ టాప్.. తాళిబొట్లు.... ఒకటా రెండా ప్రతి వస్తువూ అమ్మ దయతో దక్కినవే. అవే కాదు... మంచి నీరు - మందులు - సిమెంట్ - భోజనం వంటివి కూడా కారు చౌక ధరకు అందిస్తోంది తమిళనాడు ప్రభుత్వం. అమ్మ అందించే ఉచిత వస్తువులు ఒక్క తమిళనాడులోనే కాదు అటు కర్ణాటక - ఇటు ఏపీలోనూ కనిపిస్తున్నాయి. కొన్ని కొన్ని వస్తువులు అప్పటికే తమ వద్ద ఉండడంతో వాటిని మళ్లీ అమ్మ ఇవ్వగా తెచ్చి ఏపీలో విక్రయించేస్తున్నారు. దీంతో అమ్మ బొమ్మలున్న మిక్సీలు - ఫ్యాన్లు - గ్రైండర్లు - ల్యాప్ టాప్ లు హైదరాబాద్ వరకు వచ్చేస్తున్నాయి.
తాజాగా యువతకు దగ్గరయ్యేందుకు అమ్మ మరో డెసిషన్ తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన పెద్ద బస్టాండ్లు - మాల్స్ లో 'అమ్మ ఉచిత వైఫై' సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించింది. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తొలి దశలో 50 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. హయ్యర్ సెకండరీ - కాలేజ్ విద్యాభ్యాసం చేస్తున్న వారికి కూడా ఉచిత ఇంటర్నెట్ ను అందించనున్నామని తెలిపింది. తొలిదశలో 50 పాఠశాలల్లో రూ. 10 కోట్ల వ్యయంతో వైఫై టవర్లు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. దశలవారీగా తమిళనాడు అంతా ఉచిత వైఫై అందిస్తే కనుక అమ్మ అంబానీని మించిపోవడం ఖాయం. రిలయన్సు అధినేత ముకేశ్ అంబానీ తన జియో సిమ్ లతో ఉచిత ఇంటర్నెట్ అందిస్తూ యువత మనసు దోచుకోగా ఇప్పుడు అమ్మ అంతకుమించిన ఎత్తుగడ వేస్తున్నారని... టోటల్ తమిళనాడులోని అర్బన్ ఏరియా అంతా ఫ్రీ వైఫై పరిధిలోకి తేవాలని ట్రై చేస్తున్నారని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/