గతంలో మాదిరి ఎవరూ.. దేన్నీ అట్టే కాలం అట్టిపెట్టుకోవటం లేదు. సంతోషం కానీ.. బాధ కానీ ఏదీ కూడా ఎక్కువ కాలం క్యారీ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఈ మార్పుకు తగ్గట్లే.. మీడియా కూడా తయారైందని చెప్పాలి. ఇష్యూ ఏదైనా కానీ ఒకట్రెండు రోజులు.. లేదంటే వారం..మహా అయితే పది రోజులు తప్పించి.. ఏ విషయాన్ని అంతకు మించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి.
అయితే.. అందుకు రెండు ఉదంతాల్నిమినహాయింపులుగా తీసుకోవాల్సిందే. అందులో ఒకటి దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం ఎపిసోడ్ ఒకటైతే.. మరొకటి పెద్దనోట్ల రద్దు అంశంగా చెప్పక తప్పదు. వచ్చి పడే సమాచార సునామీతో పాటు.. ఎప్పటికప్పుడు కొత్తకొత్త విషయాలు తెర మీదకు వస్తున్న వేళ.. ఒక విషయాన్ని వారాల తరబడి సాగటం అన్నది పాత ముచ్చటగా మారిపోయింది.
అందుకు భిన్నంగా అమ్మ ఎపిసోడ్ తో పాటు.. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం సాగిందని చెప్పాలి. తాజాగా అమ్మ మరణాన్ని కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో.. ఆమె అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆమెకు సంబంధించిన వార్తలు దాదాపుగా ముగిసినట్లే. ఇక.. దేశం మొత్తాన్ని ప్రభావితం చేసిన నోట్ల రద్దు వ్యవహారం ఉండనుంది. ఏమైనా.. గడిచిన కొద్ది కాలంలో జాతి జనుల మనసుల్లో ఎక్కువ కాలం పాటు నడిచిన ఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే అమ్మ అనారోగ్యం ఎపిసోడ్ అని చెప్పకతప్పదు. సర్జికల్ స్ట్రైక్స్ కావొచ్చు.. కశ్మీర్ అంశం లాంటివన్నీ ఈ రెండింటి ముందు చిన్న ఉదంతాలుగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/