అమ్మ చనిపోయిన విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. అసలు అమ్మ అనారోగ్యానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పే వారే కనిపించరు. ఒక అర్థరాత్రి వేళ.. అమ్మ తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నారంటూ చెన్నైఅపోలోకు తీసుకురావటం తెలిసిందే. అలా ఆసుపత్రికి వచ్చిన అమ్మ.. చివరకు ఆసుపత్రిలోనే ప్రాణాలు పోయాయి. ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమె ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉన్నట్లు చెప్పినప్పటికీ.. తర్వాతి కాలంలో ఆమె కోలుకున్నట్లు.. వాకింగ్ చేసినట్లు.. పేపర్లు చదివినట్లు.. రేపోమాపో ఇంటికి వెళ్లిపోనున్నట్లు.. ఇలా చాలానే వార్తలు వచ్చాయి.
ఎవరూ ఊహించని రీతిలో కార్డిక్ అరెస్ట్ తో ఆమె ప్రాణాలు కోల్పోవటంపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే.. అమ్మ అనారోగ్యం గురించి.. ఆమెకు తాము చేసిన వైద్యం గురించి అపోలో వైద్యులు.. అమ్మకు చికిత్స చేసిన లండన్ వైద్యుడు రిచర్డ్ బీలే మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా అమ్మ ఆసుపత్రికి వచ్చే సమయానికి సెప్టిసీమియాతో బాధ పడుతున్నట్లుగా చెప్పారు. ఇంతకీ సెప్టిసిమియా.. సెప్పిస్ అంటే ఏమిటి? ప్రాణాలు తీసేంతగా ఏముంది? సెప్పిస్ కారణంగా అమ్మ అవయువాలు బలహీనమైనట్లుగా చెప్పిన నేపథ్యంలో.. అసలు దాని గురించి తెలుసుకుంటే..
సెప్టిసీమియాను సూటిగా.. ఒక్క మాటలో అర్థమయ్యేలా చెప్పాలంటే.. రక్తంలో ఇన్ఫెక్షన్. దీన్ని బ్లడ్ పాయిజనింగ్ గా కూడా వ్యవహరిస్తారు. అంటే.. బ్యాక్టీరియా కారణంగా రక్తం విషపూరితం కావటం. సెప్టిసీమియా వల్ల వచ్చేదే సెప్పిస్. శరీరంలోని ఏ అవయువానికైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తి కొన్ని రసాయనాల్ని విడుదల చేస్తుంది. ఈ క్రమంలో రక్తంలోని ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు కూడా ఇదేరీతిలో కొన్ని రసాయనాలు విడుదల అవుతాయి.
అయితే.. ఈ రసాయనాల వల్ల శరీరం మొత్తం వాపునకు గురైతే దాన్ని సెప్పిస్ గా అంటారు. పొత్తి కడుపులో.. కిడ్నీలో.. రక్తంలో ఇన్ఫెక్షన్ వస్తే సెప్పిస్ కు దారి తీసే ప్రమాదం ఉంది. రోగనిరోధక వ్యవస్థను బలహీనం చేసే వ్యాధులతో బాధ పడుతున్న వారు.. మధుమేహ బాధితుల్లో.. ఐసీయూలో చికిత్స పొందే వారిలో.. సుదీర్ఘకాలం స్టీరాయిడ్స్ మందులు వాడే వారికి సెప్పిస్ ముప్పు ఎక్కువగా పొంచి ఉంటుంది. జ్వరం.. చలి.. రక్తపోటు పడిపోవటం లాంటి లక్షణాలతో దీన్ని గుర్తిస్తారు.
ఇదెంత డేంజర్ అంటే.. దీన్ని వెంటనే గుర్తించి చికిత్స చేయకపోతే.. శరీరంలోని కీలక అవయువాలు ఒక్కొక్కటి పని చేయకుండా పోయి.. చివరకు ప్రాణం పోతుంది. అమ్మ విషయంలో సెప్పిస్ ను ముందే గుర్తించి చికిత్స చేశారు. ఆమె కోలుకుంటున్నట్లుగా వెల్లడించారు. అయితే.. అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో ఆమె శాశ్విత నిద్రలోకి జారిపోయారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/