తమిళ ప్రజలకు అమ్మగా మారిన దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన డెత్ సర్టిఫికేట్ ను జారీ చేశారు. సోమవారం అర్థరాత్రికి కాస్త ముందుగా ఆమె మరణించిన విషయాన్ని అపోలో వైద్యులు ప్రకటించారు. డెత్ సర్టిఫికేట్ లో పొందుపర్చిన వివరాల ప్రకారం.. అమ్మ సోమవారం రాత్రి 11.30 నిమిషాలకు మరణించినట్లుగా వెల్లడించింది. 68 ఏళ్ల ఆమె నివాసాన్ని పోయెస్ గార్డెన్ గా పేర్కొన్నారు.
ఈ ఉదయం పదకొండు గంటల సమయంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అమ్మ డెత్ సర్టిఫికేట్ ను జారీ చేశారు. తండ్రి పేరు జయరామ్ గా.. తల్లిపేరు సంధ్యగా పేర్కొన్న ఈ సర్టిఫికేట్ లో.. అమ్మ ఆధార్ నెంబరు మాత్రం లేకపోవటం గమనార్హం.
మరోవైపు అమ్మ అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. జాతకాలు.. ఆచారాల్ని బాగా నమ్మే అలవాటున్న జయలలిత అంతిమ సంస్కారాల్ని ఈ సాయంత్రం 4.30గంటల వేళలో జరపాలని నిర్ణయించారు. మెరీనాబీచ్ లో అమ్మ అంత్యక్రియలు జరగనున్న సంగతి తెలిసిందే. అమ్మ గురువు ఏంజీఆర్ సమాధికి కూత వేటు దూరంలో.. ఎదురు స్థలంలో ఆమెను ఖననం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆమె పార్థిప శరీరాన్ని ఉంచిన రాజాజీ హాల్ కు.. మెరీనా బీచ్ కు మధ్య దూరం కేవలం ఒకటిన్నర కిలో మీటరు మాత్రమే.
లక్షలాదిగా రోడ్ల మీదకు వచ్చేసి.. అమ్మను చూడాలని తపిస్తున్న తమిళ ప్రజానీకంతో రోడ్లు మొత్తం కిక్కిరిసిపోయాయి. అంతకంతకూ పెరిగిపోతున్న ప్రజానీకంతో అంతిమ యాత్రకు ఎంత టైం పడుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా భావిస్తున్నారు. నమ్మకాల్ని విపరీతంగా నమ్మే అలవాటున్న జయలలితను పండితులు నిర్దేశించిన వేళలోనే అంత్యక్రియలు పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/