ఏపీ విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు వీలుగా ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో ఇవ్వటం తెలిసిందే. మన్మోహన్ నోట ఐదేళ్ల మాట వినిపిస్తే.. నాడు విపక్షంలో ఉన్న బీజేపీ నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ త్వరలో తాము అధికారంలోకి రానున్నానని.. పవర్ లోకి వచ్చిన తర్వాత ఐదేళ్లు ఏంది.. పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పటం మర్చిపోకూడదు. కట్ చేస్తే.. ఏపీలోనూ.. అటు కేంద్రంలోనూ ఎన్డీయే నేతలు అధికారంలోకి రావటం జరిగింది. మోడీ సర్కారు కొలువు తీరిన నాటి నుంచి ఏపీ ప్రత్యేక హోదా విషయంలో చాలానే చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేయటం జరిగింది.
అయితే.. అందుకు భిన్నంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో తాము ఏమీ చేయలేమని.. చట్టంలో పేర్కొనని ఆ అంశాన్ని అమలు చేయటం సాధ్యం కాదని తేల్చి చెప్పేసిన మోడీ సర్కారు.. ఎన్నికల సమయంలో ఏపీ ప్రజలకు తాను హామీ ఇచ్చానన్న విషయాన్ని మోడీ మర్చిపోవటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న మాటను ప్రకటించిన కేంద్రమంత్రి సిన్హా..టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా తూచ్ అనే క్రమంలో ఆ విషయాన్ని ఆయనెంత ఓపెన్ గా తేల్చారన్నది లిఖిత పూర్వకంగా ఆయనిచ్చిన సమాధానం చూస్తే..
= 2015 డిసెంబరు 21న లోక్‌సభలో జీరో అవర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా - ఆర్థికసాయంపై 2014లో అప్పటి ప్రధాని పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని గురించి ప్రశ్న వేశారు.
= ఏపీ రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాతో పాటు ఆర్థికసాయాన్ని చేస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. అయితే ప్రత్యేకహోదా.. ఆర్థిక సాయానికి సంబంధించిన అంశాలను అప్పటి ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో చేర్చలేదు.
= విభజన అనంతరం ఏర్పడిన రాష్ట్రాలకు ఆర్థికలోటు ఏర్పడితే సాయం చేయాలని కూడా చట్టంలో ఎక్కడా ఎలాంటి సిఫార్సులు లేవు. అయితే కేంద్ర ప్రభుత్వం 46(2) సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయాన్ని అందించింది.
= నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2014-15లో రూ.4,403 కోట్లు, 2015-16లో రూ.2000 కోట్లు సాయంగా ఇచ్చింది. వీటిలో ఆర్థిక లోటుతో పాటు వెనకబడిన జిల్లాలైన చిత్తూరు.. కర్నూలు.. కడప.. అనంతపురం.. శ్రీకాకుళం.. విజయనగరం.. విశాఖపట్నం జిల్లాలకు రూ.700 కోట్లు.. కొత్త రాజధాని నిర్మాణం కోసం రూ.2050 కోట్లు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.850 కోట్లు ఇవ్వటం జరిగింది.
= ప్రత్యేకహోదా కలిగిన రాష్ట్రాలకు.. హోదా లేని రాష్ట్రాలకు సంబంధించి చేయాల్సిన సాయం గురించి 14వ ఆర్థిక సంఘం ఎలాంటి సూచనలు చేయలేదు. అయితే కేంద్రపన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే కేటాయింపులను పెంచాలన్న ఆర్థికసంఘం సూచనలను కేంద్రం ఆమోదించింది. దీంతో పాటు రెవెన్యూలోటు వున్న రాష్ట్రాలకు కూడా కేంద్రం సాయం అందించనుంది.
= ఇందులో భాగంగా ఏపీకి 2015-20 మధ్య రూ.2,06,911 కోట్ల సాయం అందనుంది. ఇందులో రూ.1,70,686 కోట్లు కేంద్రపన్నుల వాటా అందనుంది. 2016-17 కేంద్రం నుంచి ఏపీకి రూ.51,487 కోట్ల నిధులు విడుదల కానున్నాయి. ఇందులో రూ.26,850 కోట్లు కేంద్ర గ్రాంట్లు కాగా రూ.24,637 కోట్లు పన్నుల వాటా ఉంటుంది.
= ఏపీకి కేంద్రం నుంచి అందే సాయం 32 శాతం నుంచి 42 శాతానికి పెరగడం గమనార్హం. రాష్ట్రానికి మరింత ఆర్థికసాయంపై నీతిఆయోగ్ సిఫార్సులకు అనుగుణంగా పరిగణనలోకి తీసుకుంటామని తెలియజేస్తున్నాం.