అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ చంద్రబాబు నాయుడు తో పాటు పార్టీకి కూడా పెద్ద తలనొప్పిగా తయారైనట్లున్నారు. జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో తమ పెత్తనమే సాగాలని, తాము చెప్పినట్లే జరగాలని పంతం పట్టడంతో సమస్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా అనంతపురం మాజీ ఎంఎల్ఏ వైకుంఠం ప్రభాకర్ చౌదరి-జేసీ దివాకర్ రెడ్డికి పెద్ద గొడవే నడుస్తోంది. మాజీ ఎంఎల్ఏగా వైకుంఠం యాక్టివ్ గానే ఉన్నా ఇన్చార్జిగా ఆయనను తప్పించేందుకు జేసీ పావులు కదుపుతున్నారు.
తన మద్దతు దారులతో రెగ్యులర్ గా సమావేశాలు పెట్టిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలంటు మద్దతుదారులను ఆదేశించారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో తానుండగా మీ పెత్తనం ఏమిటంటే వైకుంఠం జీసీ వర్గంపై మండిపడుతున్నారు. దాంతో ఒకళ్ళపై మరొకళ్ళు చంద్రబాబుకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఎవరికీ సర్దిచెప్పలేక, ఎవరినీ వెనక్కు తగ్గమని చెప్పలేక మధ్యలో అధినేత ఇబ్బందులు పడుతున్నారు.
పోయిన ఎన్నికల్లో ఓడిపోయిన వైకుంఠం వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. ఇదే సమయంలో పోయిన ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా ఓడిపోయిన జేసీ దివాకరరెడ్డి కొడుకు జేసీ పవన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీచేయాలని డిసైడ్ అయ్యారు. అది కూడా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే పోటీ చేయాలని అనుకోవటంతోనే రచ్చ పెరిగిపోతోంది.
పోటీకి తానుండగా మరో నేతకు టికెట్ ఎలా ఇస్తారని వైకుంఠం జేసీలను గట్టిగా నిలదీస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది తామే అంటు జేసీ కూడా అంతే గట్టిగా సమాధానమిస్తున్నారు.
నిజానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది ఎవరో తెలీదు కానీ మధ్యలో ద్వితీయ స్థాయి నేతలు నలిగిపోతున్నారు. ఇటు ప్రభాకర్ చౌదరి, అటు జేసీ దివాకర్ రెడ్డి ఇద్దరిలో ఎవరూ వెనక్కు తగ్గటం లేదు.
దాంతో ఎవరికి తాము మద్దతుగా ఉండాలో తేల్చుకోలేక నేతలు నానా అవస్తలు పడుతున్నారు. అసలు ఇద్దరికీ కాకుండా మూడో వ్యక్తిని ఎవరైనా చూసి టికెట్ ఇస్తే బాగుంటుందనే టాక్ కూడా పార్టీలో నడుస్తోంది. ఎందుకంటే వీళ్ళద్దరి మధ్య ఆధిపత్య పోరులో నేతలు అంతలా విసిగిపోయారు. చివరకు ఏం జరుగుతుందో చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.