సీనియర్ రాజకీయవేత్త - కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం కొనసాగి 2014 ఎన్నికల సమయంలో టీడీపీలోకి జంప్ అయిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోరు తెరిస్తే సంచలనమైన వ్యాఖ్యలే తప్ప మరోటి ఉండదు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. సందర్భం ఏదైనా తనదైన శైలిలో కామెంట్లు చేసి అవి వివాదాస్పదం అవుతున్నప్పటికీ తన రూట్ ను ఏ మాత్రం మార్చుకోని జేసీ..మరో దఫా అలాంటి కామెంట్లే చేశారు. ఈ సారి ఏకంగా ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి కొత్త కోణం బయటపెట్టారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి రాయదుర్గం నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఆయనకు ఏర్పాటు చేసిన సన్మాన సభలో జేసీ ఈ కామెంట్లు చేశారు.
తన అల్లుడు దీపక్ రెడ్డికి పదవి ఇవ్వడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన వేరే అని జేసీ వివరించారు. ``కూరల్లో కరివేపాకులా...వ్యక్తులను అవసరమైనపుడు మాత్రమే వాడుకుని వదిలేసే రకం చంద్రబాబుది `` అనే పేరున్న నేపథ్యంలో దాన్ని తొలగించుకునేందుకు తన అల్లుడు దీపక్ రెడ్డికి ఎమ్మెల్సీ చాన్స్ ఇచ్చాడని జేసీ వ్యాఖ్యానించారు. బాబుకు ఉన్నంత ఆశ దేశంలో ఏ ఒక్కరికీ లేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతోందనే వార్తలు రావడం బాధాకరమని జేసీ అన్నారు. అందుకే అధికారులు - రాజకీయ నాయకులు అవినీతికి దూరంగా ఉండాలని జేసీ కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/