అప్పుడు ట్రావెల్స్.. ఇప్పుడు ఫ్యాక్టరీ ..వైసీపీ నా మీద పగ పట్టింది !

Update: 2020-02-01 04:04 GMT
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును తాజాగా జగన్ సర్కారు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తన కంపెనీల లీజు రద్దు కంటే రాష్ట్రానికి వైసీపీ చేస్తున్న అన్యాయమే ఎక్కువ అని మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జేసీ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం పగ.. పగ.. పగ.. అంటూ రగిలి పోతోందని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంతో పోల్చుకుంటే.. తనకు జరిగిన అన్యాయం ఎంత అంటూ ప్రశ్నించారు. మా కంపెనీ లీజు ఎందుకు రద్దు చేశారో న్యాయస్థానంలో తేల్చుకుంటానని జేసీ స్పస్టం చేశారు. ఎవడు మాట వినకపోయినా వాళ్ల మీద జగన్ సర్కారు పగ తీర్చుకుంటుంది అని , మాట వినని వారి ఆర్థి మూలాలు దెబ్బతీసి , వారి కుటుంబాలని రోడ్డున పడేయాలని చూస్తుంది అంటూ సంచలన ఆరోపణలు చేసారు.

ఇకపోతే , జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి కి చెందిన ట్రావెల్ బస్సులపై వైసీపీ సర్కారు దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. సరైన అనుమతులు లేవంటూ పలు బస్సు సర్వీసులను సీజ్ చేసింది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేస్తున్నారని ఆర్టీఏ అధికారులు.. జేసీ సోదరులకు చెందిన 8 బస్సులను సీజ్ చేశారు.
Tags:    

Similar News