జేసీతో చంద్ర‌బాబు `రాజీ` నామా?

Update: 2018-07-19 17:04 GMT
శుక్ర‌వారం జ‌ర‌గ‌బోతోన్న అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో పాల్గొన్న అనంతరం త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌బోతున్న‌ట్లు జేసీ దివాక‌ర్ రెడ్డి ప్ర‌క‌టించిన‌ సంగ‌తి తెలిసిందే. రేపు లోక్ స‌భకు హాజ‌ర‌వుతాన‌ని స్ప‌ష్టం చేసిన జేసీ....ఓటింగ్ అనంత‌రం రాజీనామా చేయ‌బోతున్నార‌ని ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ...జేసీని బుజ్జ‌గించేందుకు చంద్ర‌బాబు రంగంలోకి దిగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. జేసీతో చంద్ర‌బాబు స్వ‌యంగా ఫోన్ లో మాట్లాడి న‌చ్చ‌జెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో జేసీ `రాజీనామా`ఎపిసోడ్ తాజాగా మ‌రో మ‌లుపు తిరిగింది. త‌న రాజీనామా గురించి రేపు సాయంత్రం క్లారిటీ ఇస్తాన‌ని జేసీ....మీడియా స‌మావేశంలో వెల్ల‌డించి అంద‌రికీ షాకిచ్చారు. దీంతో, జేసీ...రాజీనామా చేయ‌బోతున్నారా...లేదా అన్న విష‌యంపై తీవ్ర ఉత్కంఠ ఏర్ప‌డింది.

జేసీ రాజీనామా వార్త‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌ను మీడియా ప్ర‌తినిధులు క‌లిసే ప్ర‌య‌త్నం చేశారు. వారితో మాట్లాడిన జేసీ ...త‌న‌దైన శైలిలో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. తన‌కు చంద్ర‌బాబు ఫోన్ చేసి మాట్లాడార‌ని, అవిశ్వాసంలో పాల్గొన‌కుంటే టీడీపీకి మాయ‌ని మ‌చ్చ అవుతుంద‌ని చెప్పార‌ని అన్నారు. త‌న వ‌ల్ల పార్టీకి చెడ్డ‌పేరు రావ‌డం ఇష్టం లేద‌ని, దీంతో, త‌న మ‌న‌సు మార్చుకొని అవిశ్వాసం ఓటింగ్ లో పాల్గొనాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని జేసీ అన్నారు. రాజీనామా గురించి మీడియా ప్ర‌తినిధులు జేసీని ప్ర‌శ్నించ‌గా....ఆయ‌న స‌మాధానం దాట‌వేశారు. త‌న రాజీనామా వ్య‌వ‌హారాన్ని జేసీ స‌స్పెన్స్ లో పెట్టారు. అపుడే అంత తొంద‌ర ఎందుక‌ని....ఆ విష‌యం గురించి త‌ర్వాత చూద్దామ‌ని.....రేపు సాయంత్రం ఢిల్లీలో ఆ విష‌యంపై క్లారిటీ ఇస్తాన‌ని....జేసీ త‌న‌దైన శైలిలో చ‌మ‌త్క‌రిస్తూ ఆ స‌మావేశాన్ని ముగించారు. మొత్తానికి జేసీ రాజీనామా వ్య‌వ‌హారంపై పూర్తి  క్లారిటీ రావాలంటే....రేపు సాయంత్రం వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు. మ‌రోవైపు, జేసీతో చంద్ర‌బాబు `రాజీ` నామా...న‌డిపార‌ని...అందుకే జేసీ రాజీనామాపై త‌న మ‌న‌సు మార్చుకొని ఉండ‌వ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View

Tags:    

Similar News