ఏపీ ఎంపీల నినాదాలు - ఆందోళనలతో ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభ దద్దరిల్లింది. ఇటు సభలో అటు బయట అధికార తెలుగుదేశం పార్టీ మొదలు - ప్రతిపక్ష వైసీపీ - కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. ఇక తనదైన శైలిలో స్పందించే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బాబుపై పంచ్ వేశారు. లోక్‌సభలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. సభా కార్యక్రమాలకు అడ్డుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంత వారించినా.. ఎంపీలు ఆందోళన విరమించలేదు. దీంతో ఉదయం స్పీకర్ ఓ సారి సభను వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మళ్లీ నినాదాలతో హోరెత్తించారు. వెల్‌లోకి దూసుకువెళ్లి కార్యక్రమాలకు అడ్డుపడ్డారు. ప్రశ్నోత్తరాలకు మంత్రులు సమాధానం ఇస్తున్నా.. ఆంధ్రా ఎంపీలు మాత్రం తమ ఆందోళన విడవలేదు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలక ప్రకటన చేశారు. విభజన చట్టం హామీలకు కేంద్రం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకు బదులు.. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని - దీని ప్రకారం ఈపీఏ ప్రాజెక్టుల కింద విదేశీ సంస్థ నుంచి ఏపీ ప్రభుత్వం రుణం తీసుకుంటే కేంద్రం 90 శాతం చెల్లిస్తుందని రాజ్యసభలో జైట్లీ ప్రకటించారు. ఈపీఏ నిధులను నాబార్డు ద్వారా ఇవ్వాలని చంద్రబాబు అడిగారని, అయితే ఇలా ఇస్తే రాష్ట్రానికి అప్పు తీసుకునే సామర్థ్యం తగ్గి ద్రవ్యలోటులో వ్యత్యాసం ఏర్పడుతుందని అన్నారు. రెవెన్యూలోటు భర్తీ మరో సమస్య అని ఇందుకు సంబంధించి కొత్త ఫార్మూలాను రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని జైట్లీ చెప్పారు. లోటుభర్తీ కింద ఇప్పటికే రూ. 3,900 కోట్లు ఇచ్చినట్లు జైట్లీ వివరించారు. సమస్య పరిష్కారంపై చర్చలు జరుపుతామని, ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శిని పిలిపించి చర్చలు జరపాలని కేంద్ర వ్యయ కార్యదర్శకి సూచించినట్లు జైట్లీ చెప్పారు.
కేంద్ర మంత్రి అనంత్ కుమార్ సైతం టీడీపీ ఎంపీల ఆందోళనపై స్పందించారు. టీడీపీ ఎంపీలు చేస్తున్న డిమాండ్ చాలా సున్నితమైన అంశమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిపై ప్రధాని, కేంద్ర ప్రభుత్వం చాలా లోతుగా ఆలోచిస్తున్నదని, సభ్యుల ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటామని ఆయన అన్నారు. మరోవైపు రైల్వే మంత్రి పియూష్ గోయల్ రైల్వే జోన్‌పై పాత మాటే చెప్పారు. విభజన చట్టంలో రైల్వే జోన్ సాధ్యాసాధ్యాలను పరిశీలన చేయాలని మాత్రమే ఉందని, విభజన చట్టాన్ని యూపీఏ సరిగా చేసి ఉంటే ఈ సమస్యలు తలెత్తేవికావని అన్నారు. విశాఖ రైల్వే జోన్‌పై పొరుగు రాష్ట్రాలతో చర్చిస్తున్నామని, సానుకూల పరిస్థితి కోసం కృషి చేస్తున్నామని రాజ్యసభలో చెప్పారు.
కాగా, తమ పార్టీ అధినేతపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పట్లాగే తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నదొకటి - ఈరోజున అమలు పరుస్తామంటున్నది మరోటి అని మండిపడ్డారు. ఏపీకి ఏదో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని అన్నారని, ఇప్పుడు, ఆ ప్యాకేజీ లేదూ, పీకేజీ లేదంటూ విమర్శించారు. నాడు ధర్మరాజు అంతటి వాడే యుద్ధానికి ‘సై’ అన్నాడు, మరి, ఈయన (చంద్రబాబు) ఎప్పుడంటారో చూడాలంటూ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న తమను పరిగణనలోకి తీసుకుని ఉంటే బాగుండేదని, ప్రజాస్వామ్య పద్ధతిలో రావాల్సిన నిధులు ఏపీకి వచ్చాయి తప్ప, మిత్రపక్షమని చెప్పి ఒక్క రాగి పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి సహనం ఎక్కువ. ఇంకా, ఏదో జరుగుతుందనే ఆశలో ఉన్నారు. ఆ మహానుభావుడు ఇంకెంత కాలం చూస్తాడో! ఈ సహనమే కొంపముంచుతోంది. సహనానికి కూడా హద్దుండాలి! మేము మిత్రపక్షంగా ఉండాల్సిన అవసరముందా?’ అని పునరాలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. `` అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
2014 ఎన్నికల సమయంలో తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చేసిన వాగ్ధానం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. విభజన చట్టం సవరణకు తాము ప్రతిపాదించిన ప్రైవేట్ బిల్లును..రాజ్యసభ సెక్రటేరియట్ తిప్పిపంపారని కేవీపీ తెలిపారు. చట్టప్రకారం తమకు దక్కాల్సినవి దక్కడం లేదని...మరోవైపు సబళో చర్చకు అవకాశం దొరకలేదని వ్యాఖ్యానించారు. కాగా, కేంద్రం తీరు వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. అమరావతిలో నూతన రాజధానిని కట్టడానికి కేంద్రం నిధులు ఇవ్వాల్సిందేనని తెలిపారు. విభజన హామీలపై రాజ్యసభలో అడగాలని అనుకున్నా.. సభ వాయిదా పడడం వల్ల అవకాశం రాలేదని సుబ్బరామిరెడ్డి వాపోయారు.
ఇదిలాఉండగా...కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ - పీయూష్ గోయల్ చూసిన ప్రకటనలపై టీడీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్ సభలో ప్రకటన తర్వాత సీఎం చంద్రబాబుతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని రాజ్యసభ టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. కాగా, విభజన హామీలపై కేంద్రం తీరుకు నిరసనగా వైసీపీ వాకౌట్ చేసింది.