జగన్ ప్రభుత్వంపై జేసీ సంచలన ఆరోపణలు

Update: 2021-01-02 09:15 GMT
ఏపీలోని జగన్ సర్కార్ పై అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ సర్కార్ అట్రాసిటీ కేసులను రాజకీయంగా వాడుకొని తమను హింసిస్తోందని జేసీ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఇప్పుడు జగన్ కు బ్రహ్మాస్త్రంగా మారిందని అన్నారు.

రెండు సంవత్సరాల తర్వాత ప్రభోదనంద ఆశ్రమంపై కేసును వాడుకుంటున్నారు. కులం పేరుతో సీఐని దూషించినట్లుగా తప్పుడు కేసు పెట్టారని జేసీ వాపోయారు. ఆ సీఐ కులం ఏదో కూడా తనకు తెలియదు అని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిని ఎన్నికల సమయంలో కేసులు పెట్టి లోపల వేసేందుకు ఇలా చేస్తున్నారని జేసీ ఆరోపించారు. అట్రాసిటీ కేసును పరిష్కరించే వరకు ఈనెల 4 నుంచి తాడిపత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్నామని జేసీ ప్రకటించారు.

శ్రీకాకుళం, వైజాగ్ మినహా అన్ని ప్రాంతాల వారు అమరావతి రాజధాని కోసం ఆందోళన చేస్తున్నారని.. ప్రధాన మంత్రి మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని జేసీ డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రం అసలు భారతదేశంలో ఉందా అని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు.
Tags:    

Similar News