టీడీపీకి షాక్.. వైసీపీలోకి జేసీ సన్నిహితుడు

Update: 2018-05-19 11:14 GMT
ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినా కూడా నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. నాయకులు టీడీపీలో ఉంటే తమ భవిష్యత్తు బాగుండదని ఆలోచిస్తున్నారు. బలాన్ని బట్టి తమకు అనుకూలమైన పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. వైఎస్ జగన్ పాదయాత్రలో వరుసగా చేరుతున్న నాయకులను చూసి టీడీపీ శిబిరంలో కలకలం మొదలవుతోంది...

 అధికార పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న  ఈపరిణామాలు ప్రతిపక్ష వైసీపీకి గొప్ప బలాన్ని ఇస్తుండగా.. టీడీపీలో కలవరపాటుకు గురిచేస్తున్నాయి..

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు  - యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం గోపాలనగరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ను కలిసి ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు..

ఈ సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి అతన్ని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అతనితో పాటు వందలాది మంది అనుచరులు పార్టీలో చేరారు. దీంతో ఎంపీ జేసీకి ఎదురుదెబ్బ తగిలింది.

Tags:    

Similar News