జూలై 1 వరకు జేసీకి నో బెయిల్

Update: 2020-06-27 05:14 GMT
జేసీ ట్రావెల్స్ బస్సుల విషయంలో అక్రమాలపై అరెస్ట్ అయిన టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. వీరిద్దరికీ మళ్లీ షాక్ తగిలింది. ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలపై వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఇప్పటికే వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో నమోదైన కేసుల్లో రిమాండ్ లో ఉన్న వీరిద్దరికీ తాజాగా జూలై 1 వరకు రిమాండ్ పొడిగించారు. ఇప్పటికే ఓ కేసులో జూన్ 24 వరకు రిమాండ్ విధించారు.

ఇక వీరిద్దరిపై తాజాగా అనంతపురంలో వరుస కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కడప జైలులో ఉన్న వీరిద్దరినీ పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట విచారణకు హాజరు పరిచారు. జూలై 1 వరకు జిల్లా కోర్టు ఈ ఇద్దరికీ రిమాండ్ విధించింది.

ఇక వీరద్దరికీ బెయిల్ ఇవ్వాలని అనంతపురం జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలైంది.  దీనిపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

ఇక ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను తమ కస్టడీకి అప్పగించాలని తాడిపర్తి పోలీసులు గుత్తి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో వీరి కష్టాలు మరింత రెట్టింపవుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే ఈ ఇద్దరూ ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదు.
Tags:    

Similar News