డీఎస్పీల‌కు.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాన‌ని జ‌గ‌న్ చెప్పాడా?

Update: 2022-09-28 17:30 GMT
ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని తాడిప‌త్రి ఎప్పుడూ.. రాజ‌కీయంగా వేడెక్కుతూ ఉన్న‌విష‌యం తెలిసిం దే. గ‌తంలో స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్‌.. వ‌ర్సెస్ టీడీపీ నేత‌లు.. జేసీ దివాక‌ర్‌, ప్ర‌భాక‌ర్‌ల‌కు వివాదాలు న‌డిచా యి. అయితే.. ఇప్పుడు మ‌రోసారి.. డీఎస్పీ వ‌ర్సెస్ జేసీల‌కు మ‌ధ్య తీవ్ర వివ‌దాలు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి తాజాగా డీఎస్పీని ఉద్దేశించి.. ``డీఎస్పీల‌కు.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాన‌ని జ‌గ‌న్ చెప్పాడా?`` అంటూ నిల‌దీశారు.

తాడిపత్రి ఎమ్మెల్యేకు తొత్తుగా మారిన డీఎస్పీ చైతన్య... తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కేసులతో వేధిస్తు న్నారని తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. తాము ఏ కార్యక్రమం తలపెట్టినా అనుమతివ్వడం లేదని ధ్వజమెత్తారు. తమను వేధిస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ వస్తుందనే ఆశతో డీఎస్పీ ఉన్నారని, అయితే.. జ‌గ‌న్ అంత పిచ్చోడు కాడ‌ని.. సొంతోళ్ల‌నే వాడుకుని వ‌దిలేశాడ‌ని.. ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ కార్యకర్తలపై తాడిపత్రి డీఎస్పీ చైతన్య అక్రమ కేసులు పెడుతూ ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరి స్తున్నారని  ఆరోపించారు. పోలీసుల వ్యవహారంపై తాడిపత్రిలో జేసీ మండిపడ్డారు. శాంతియుతంగా ఏ కార్యక్రమం చేయాలన్నా అనుమతి నిరాకరించే డీఎస్పీ.. వైసీపీలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గణేష్ విగ్రహం పెట్టాలన్నా, శాంతియుత ఆందోళన చేస్తామన్నా దేనికీ అనుమతి ఇవ్వని డీఎస్పీ.. పద్ధతి మార్చుకోవాలని జేసీ హెచ్చరించారు.

తప్పుడు కేసులతో తమను బెదిరించాలని చూస్తే.. అది సాధ్యం కాదని.. ఇలాంటి బెదిరింపు కేసులు చాలా చూశామని జేసీ అన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్న వారిపై కేసులు పెట్టకుండా.. డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే తమపైనే అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఎంత విధేయత చూపినా తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ రాదని జేసీ ప్రభాకర్ రెడ్డి.. డీఎస్పీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News