పవన్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రేమకు కారణమేంటి?

Update: 2022-04-13 15:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ నా వెంట్రుక కూడా పీకలేరు అనే వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సీఎం స్థాయి వ్యక్తి అనే మాటలు కావనే మాటలు వస్తున్నాయి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఆయన ఇలా నీతిమాలిన మాటలు మాట్లాడుతూ తనలోని రాక్షసత్వాన్ని బయటపెడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. విద్యాదీవెన పథకం ప్రారంభోత్సవంలో పిల్లలున్నారనే విషయం మరిచి అలా వ్యాఖ్యలు చేయడంపై ప్రతిపక్షాలు సైతం మండిపడుతున్నాయి. జగన్ కు అధికారం పోతుందనే ఉద్దేశంతోనే ఇలా దిగజారి మాట్లాడుతున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి.

జగన్ వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర కామెంట్ చేశారు. జగన్ వ్యాఖ్యలు ఆయన పార్టీని ఉద్దేశించి చేసినవే పేర్కొనడం గమనార్హం. మంత్రివర్గ కూర్పుపై ఎవరు మాట్లాడకుండా వెంట్రుకలతో సమానమని చెప్పడం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా ఇలాంటి బూతు మాటలతో కాలక్షేపం చేయడం ఆయనకే చెల్లుతుందని చెబుతున్నారు.

రైతుల కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్  చేస్తున్న సేవలపై ప్రశంసించారు. ఆయన రైతుల పక్షాన నిలబడటం నిజంగా ఆహ్వానించదగినదే. వైసీపీ ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ చేపట్టిన పరిహారం వారికి ఎంతో మేలు చేస్తుందని తెలుస్తోంది.

మరోవైపు మంత్రివర్గ విస్తరణతో జగన్ అసమ్మతి కుంపటి రగిలించుకున్నారు. చాలా మంది పదవులు రాని వారు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. తమకు పదవి దక్కకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జగన్ వెంట ఉండేది లేదని ప్రతిపక్షాలతో టచ్ లో ఉంటున్నారు. భవిష్యత్ లో పార్టీని వీడేందుకు కూడా వెనుకాడటం లేదు. దీంతో జగన్ కు రాబోయే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పేలా లేవు. దీనిపై ఇప్పటికే ఆలోచనలో పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స

తిరుమలలో భక్తులకు కూడా సరైన సదుపాయాలు కల్పించడం లేదనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఇటీవల తిరుమల కొండపై జరిగిన తొక్కిసలాట చూస్తుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. భక్తులకు సరైన విధంగా సేవలందించడంలో ఉండాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే భక్తులకు ఇబ్బందులు తలెత్తాయనే వాదన కూడా వస్తోంది. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో మరిన్ని కష్టాలు ఎదుర్కొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కొత్త జిల్లాల ఏర్పాటులో కూడా ప్రభుత్వంపై విమర్శలే వచ్చాయి. చాలా ప్రాంతాల్లో సొంత పార్టీ కార్యకర్తలే రోడ్లెక్కి నిరసన తెలిపిన సంఘటనలు ఉన్నాయి. దీంతో అధికార పార్టీకి రాబోయే ఎన్నికలు సవాలునే సూచిస్తున్నాయి. గతంలో వలె విజయం నల్లేరు బండిపై నడకలా ఉండదని పోటీ తీవ్రంగా ఉండనుందని తెలుస్తోంది. దీంతో జగన్ వచ్చే ఎన్నికలనే లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్తున్నా విజయం సాధించడం అంత సులువైన విధంగా ఉండదనే విషయం తెలుస్తోంది. ఏదిఏమైనా ఏపీలో జగన్ కు చుక్కెదురు పరిస్థితులే ఎదురు కానున్నట్లు సమాచారం.
Tags:    

Similar News