14 త‌ర్వాత నేనేంటో చూపిస్తా: జేసీ హాట్ వార్నింగ్‌

Update: 2023-04-10 10:29 GMT
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తాడిప‌త్రి కౌన్సిల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి గ‌ట్టి వార్నిం గ్ ఇచ్చారు. ఈ నెల 14 త‌ర్వాత తానేంటో చూపిస్తాన‌ని హెచ్చ‌రించారు. తానేమీ చేత‌గాని వాడిని కాద‌న్నారు. త‌మ వ‌ర్గాన్ని అణ‌గ‌దొక్కే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని.. తాము ఏం చేసినా అణిగిపోమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. రోజులు అన్నీ ఒకేలా ఉండ‌బో వ‌ని.. త‌మ‌కు కూడా చాన్స్ వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ఈ నెల 14 త‌ర్వాత‌.. తాడిప‌త్రి రాజ‌కీయం పూర్తిగా మారిపోతుంద‌ని జేసీ వ్యాఖ్యానించారు.

తాడిప‌త్రి మండలంలోని ఆవుల తిప్పయపల్లి, గాదర గుట్టపల్లి గ్రామాల సమీపంలో ఉన్న కొండను తవ్వి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. గాదర గుట్టపల్లి గ్రామంలోని యువకులు కొండ ను తవ్వుతున్న ప్రదేశానికి వెళ్లారు.

ఈ తవ్వకాలకు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని కోరారు. అక్కడ జరుగుతున్న తవ్వకాలను ఆ యువకులు వీడియోలు తీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడకు చేరుకున్న ఎస్ఐ వారి మొబైల్స్ను బలవంతంగా తీసుకొని పోలీస్ స్టేషన్కు తెచ్చారు.

ఈ విషయంపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఆయన స్వ‌యంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి.. మొబైల్స్ ఎలా తీసుకుంటారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్రమంగా ఇసుక, మట్టి తోలుతున్నా... వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరుకానీ, అమాయకులైన ప్రజల మీద దౌర్జన్యం చేస్తారా అని ప్రశ్నించారు.

అక్రమ ఇసుక రవాణాలో ఎస్ఐ కి భాగం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. 14వ తేదీ నుంచి తానేంటో చూపిస్తానని, తాడిప‌త్రిలో మార్పు త‌ప్ప‌ద‌ని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News