వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కుల వివాదం పై జెసి ఏంచెప్పారంటే ?

Update: 2019-11-26 14:30 GMT
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం  వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి  కుల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఎస్సీ కులానికి చెందిన మహిళ కాకపోయినా, ఎస్సీనంటూ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఎమ్మెల్యే గా  గెలుపొందారని ఆమెపై కొన్ని రోజుల క్రితం  ఫిర్యాదు చేసారు. అర్హురాలు కాకపోయినా ఎస్సీ రిజర్వుడు స్థానమైన తాడికొండ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారని, కులాన్ని తప్పుగా పేర్కొనడం నేరమని ,దీనికి గాను ఆమెని ఎమ్మెల్యే పదవికి అనర్హురాలిగా ప్రకటించి, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు శ్రీదేవిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీ కాదంటూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం శ్రీదేవి పై జిల్లా కలెక్టర్ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్రపతి భవన్ కు ఫిర్యాదు చేసింది. ఇక దీనిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పతి భవన్ అధికార వర్గాలు అప్పటి సీఎస్ కు లేఖ రాసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నుండి వచ్చిన లేఖ ఆధారంగా జిల్లా కలెక్టర్ ఉండవల్లి శ్రీదేవిని విచారణకు రావాలని కోరారు. దీనితో ఈ రోజు ఆమె అన్ని వివరాలతో విచారణకి హాజరైంది.

ఇక  అన్ని వివరాలతో వచ్చిన ఎమ్మెల్యే శ్రీదేవిని, జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ విచారించారు. శ్రీదేవి స్టడీ సర్టిఫికేట్లను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. తన మెడిసిన్ సర్టిఫికేట్లను జెసికి చూపించారు. వైద్యురాలిగా చేసిన సర్వీసును కూడా  పత్రాలతో సాక్ష్యాలుగా చూపించారు. శ్రీదేవి చూపించిన పత్రాలను క్రాస్ చెక్ చేసిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని  జాయింట్ కలెక్టర్ దినేష్ చెప్పారు.  దీనిపై ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ .. గత ప్రభుత్వం హయంలో ఏపీ రాజధాని అమరావతి లో జరిగిన అవినీతిని వెలికి తీస్తున్నందుకే ప్రతిపక్ష పార్టీల నేతలు తనను టార్గెట్ చేసి,ఆరోపణలు చేస్తున్నారని శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News