స‌ర్వేలంతా ఈజీ కాదు.. రాజ‌కీయం పీకే!

Update: 2020-02-01 07:42 GMT
ఎన్నో పార్టీల‌కు త‌న మేధా శ‌క్తి తో అధికార బాట ప‌ట్టించాడు.. ఎంతో మందికి రాజ‌కీయ భ‌విష్య‌త్ క‌ల్పించాడు. అంద‌రి భ‌విష్య‌త్ ఎదుగుద‌లకు తోడ్ప‌డిన తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చి వెలుగు వెల‌గాల‌ని భావించాడు. అయితే ఆ వ్య‌క్తికి కాల క‌ల‌సి రాలేదు. 2011 - 14లో న‌రేంద్ర‌మోదీ (బీజేపీ), 2015లో నితీశ్‌ కుమార్ (జేడీయూ), 2017లో బీజేపీ, 2019లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి (వైఎస్సార్‌షీపీ) అధికారంలోకి వ‌చ్చేందుకు త‌న బృందంతో విశేష కృషి చేసిన వ్య‌క్తి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ విష‌యంలోనే త‌ప్ప‌ట‌డులు వేస్తున్నాడు. ఆయ‌నే రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ అలియాస్ పీకే.

పార్టీల‌కు ప‌ని చేయ‌డం ఆపేసి ప్ర‌శాంత్ కిశోర్ గ‌తేడాది రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడు. సొంత రాష్ట్రం బీహ‌ర్‌లో ఉన్న అధికార పార్టీ జ‌న‌తాద‌ళ్ (యునైటెడ్‌)లో చేరాడు. తాను అధికారంలోకి వ‌చ్చేందుకు కృషి చేసిన వ్య‌క్తి కావ‌డం తో సీఎం నితీశ్‌కుమార్ త‌న పార్టీ ఉపాధ్య‌క్షుడిగా పీకే నియ‌మించాడు. కొన్నాళ్లు బాగానే ఉన్న వీరి సంబంధం ఇటీవ‌ల కేంద్రం తీసుకొచ్చిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం(సీఏఏ), ఎన్నార్సీకి నితీశ్‌కుమార్ మ‌ద్ద‌తు ప‌లికి స్వాగ‌తించారు. ఈ నిర్ణ‌యాల‌ను అదే పార్టీలో ఉన్న ప్ర‌శాంత్‌కిశోర్ వ్య‌తిరేకించాడు. దీంతో నితీశ్‌ కు ప్ర‌శాంత్‌ కిశోర్‌ కు మ‌ధ్య బేధాప్రాయాలు వ‌చ్చాయి. త‌ర‌చూ కేంద్రం పై విమ‌ర్శ‌లు చేస్తుండ‌డంతో నితీశ్ ఆగ్ర‌హం తో పీకేను పీకేశాడు. పార్టీ నుంచి స‌స్పెండ్ చేశాడు.

ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ కిశోర్ ఏ రాజ‌కీయ పార్టీలో లేడు. అయితే అత‌డిని త‌మ పార్టీలో చేరాలంటూ వివిధ పార్టీలు త‌లుపులు తెర‌చి ఉంచాయి. పీకే వ‌స్తే తాము సాద‌రంగా ఆహ్వానిస్తామ‌ని తృణ‌మూల్ పార్టీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఆయ‌న ప్ర‌స్తుతం ఆప్‌తో స‌త్సంబంధాలు కొన‌సాగిస్తున్నాడు. అయితే ఆయ‌న కోసం మ‌రో పార్టీ కూడా ఎదురు చూస్తోందని స‌మాచారం.

ముఖ్య‌మంత్రి ప‌ద‌వి పోయి, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వంతో క‌ర్నాట‌క‌లో జేడీఎస్ పార్టీ త‌న భ‌విష్య‌త్ కోసం ప్ర‌శాంత్ కిశోర్‌ తో క‌ల‌వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. మూడేళ్ల‌ల్లో క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. ఆలోపు పార్టీ స‌న్న‌ద్ధ‌త‌, తిరిగి అధికారం చేజిక్కించుకోవ‌డం కోసం పీకే తో క‌ల‌వాల‌ని జేడీఎస్ భావిస్తోంది. తాజాగా మాజీ సీఎం కుమార‌స్వామి తో ప్ర‌శాంత్‌కిశోర్ భేటీ అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే ఎప్పుడు, ఎక్క‌డ అనేది ఇంకా తెలియ‌లేదు. జేడీఎస్ మాత్రం పీకేను ఆహ్వానిస్తున్న‌ట్లు ఎక్క‌డా ప్ర‌క‌టించ‌లేదు. మాజీ ప్ర‌ధాన‌మంత్రి దేవెగౌడ‌, మాజీ సీఎం కుమార‌స్వామి తమ భ‌విష్య‌త్ కోసం పీకేతో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం ఉంది.


Tags:    

Similar News