అధికారపక్షంలో వందకు పైగా ఎమ్మెల్యేల తో ఎంత బలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతమంది గులాబీ నేతలు ఉన్నా.. ఏదైనా జరిగిన వెంటనే.. పార్టీని కానీ అధినేతను ఉద్దేశించి ఎవరైనానోరు పారేసుకున్నంతనే చెలరేగిపోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది. పేరుకు ఎమ్మెల్యే అయినా.. ప్రత్యర్థుల్ని తన మాటలతో ఉతికి ఆరేసే వాళ్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముందుంటారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన బండి సంజయ్ హైదరాబాద్ లో అడుగు పెడుతూనే.. సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఎంతేసి మాటలు అన్నారో తెలిసిందే.
ఈ నేపథ్యంలో వాటికి సమాధానం చెప్పేందుకు రంగంలోకి దిగారు జీవన్ రెడ్డి. కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అన్నట్లు బండి సంజయ్ తీరు ఉందని ఎద్దేవా చేసిన ఆయన.. ఆయన చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారంటూ సింఫుల్ గా తేల్చేశారు. మా కారు తో మీ కమలం దుమ్ము రేగుతోంది.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చేశారు.
మూడేళ్లలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేశామన్న జీవన్ రెడ్డి.. ఆ మూడేళ్ల లో ఒక్క రూపాయి అయినా తీసుకొచ్చావా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా.. బీజేపీ చతికిలపడిందన్న జీవన్.. నువ్వు ఒక్కసారి గెలిచావ్.. నేను రెండుసార్లు గెలిచా.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడంటూ మండిపడ్డదారు. బండి సంజయ్ మాటలు అవగాహన లేకుండా మాట్లాడినట్లు ఉన్నాయని.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కి ఘోరీ కట్టారన్నారు.
ప్రగతి భవన్ ను కూల్చేస్తానని బండి సంజయ్ అన్నారని.. మీకు ఒక్క కార్యకర్త అయినా ఉన్నాడా? పిచ్చి లేసి మాట్లాడుతున్నావా? అని ఫైర్ అయ్యారు. ఈ పోటుగాడు కేసీఆర్ గుండెల్లో నిద్రపోతానని అంటున్నాడన్న జీవన్ రెడ్డి.. ఏళ్ల తరబడి నిద్రపోయింది బీజేపీనేనని.. ముందు కాస్త ట్రైనింగ్ తీసుకొని మాట్లాడాలన్నారు. బండి సంజయ్ ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి బండి ఘాటు విమర్శలు చేసిన నేపథ్యంలో సీన్లోకి వచ్చిన జీవన్ రెడ్డి అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మరి.. దీనికి కమలనాథులు స్పందిస్తారా? లేక.. మౌనంగా ఉంటారా? మాటకు మాట అన్న రీతిలో బదులిస్తారా? అన్నది కాలమే తేల్చాలి.మొత్తంగా అయితే.. కారు సెగ ఎలా ఉంటుందో బండికి జీవన్ రెడ్డి శాంపిల్ చూపించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.