ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్న జెరుసలెం మత్తయ్య ఈ మధ్యన సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి తనను వాడుకొని వదిలేశారన్న అర్థం వచ్చేలా మాట్లాడిన ఆయన.. ఏపీ.. తెలంగాణ సీఎం ఇద్దరిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణభయం ఉందని.. అందుకేఢిల్లీలో ఉన్నట్లుగా చెప్పిన ఆయన.. తాజాగా ఒక ఛానల్ లో దర్శనమిచ్చాడు. ఈ సంద్భంగా మాట్లాడిన మత్తయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాకుంటే.. ఒక రోజు క్రితం బాబు మీద దూకుడు వ్యాఖ్యలకు భిన్నంగా ఆయన టోన్ లో మార్పు రావటం గమనార్హం. ఓటుకు నోటు కేసు కానీ.. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ రాజీ పడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ఇష్యూలో తనను అన్యాయంగా ఇరికించినట్లుగా చెప్పిన మత్తయ్య.. ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేల్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనలేదంటూ ప్రశ్నించారు.
మత్తయ్య నోటి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరిన్ని విమర్శలు సంధించేలా ప్రశ్నించినా.. మత్తయ్య మాత్రం అందుకు భిన్నంగా ఆచితూచి మాట్లాడటం గమనార్హం. చంద్రబాబు కారణంగా తనకు ప్రాణహాని ఉందని.. అవసరానికి వాడుకొని చంద్రబాబు తనను వదిలేశారంటూ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించినప్పుడు మాత్రం మత్తయ్య రియాక్ట్ కాకుండా మాట దాటేసే ప్రయత్నం చేయటం గమనార్హం. సోమవారం దూకుడు మంగళవారానికి వచ్చేసరికి ఏమైందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. మత్తయ్యతో మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేయాలన్న ప్రయత్నాలు సఫలం కాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది