అక్క‌డ భార‌త సంత‌తి యువ‌తి దారుణ హ‌త్య‌

Update: 2018-05-18 05:08 GMT
దారుణం చోటు చేసుకుంది. భార‌త సంత‌తికి చెందిన యువ‌తిని ఉత్త‌ర ఇంగ్లండ్లో దారుణంగా హ‌త్య‌కు గుర‌య్యారు. గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఆమెను కిరాత‌కంగా హ‌త్య చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇంగ్లండ్లోని మిడిల్స్ బ‌రో ప‌ట్ట‌ణంలో చోటు చేసుకున్న ఈ హ‌త్య స్థానికంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

హ‌త్య‌కు గురైన భార‌త సంత‌తి యువ‌తిని జెస్సీకా ప‌టేల్ గా గుర్తించారు. ఫార్మాసిస్టుగా ప‌ని చేస్తున్న ఆమె హ‌త్య వెనుక కార‌ణాలు ఏమిట‌న్న‌ది ఇంకా తెలియ‌రాలేదు. షాకింగ్ విష‌యం ఏమిటంటే..  జెస్సికా హ‌త్య‌కు గురైన ఆమె నివాసం రద్దీ రోడ్డుకు అనుకొని ఉండ‌టం. నిత్యం ర‌ద్దీగా ఉండే ప్రాంతంలో హ‌త్య‌కు గురి కావ‌టం సంచ‌ల‌నంగా మారింది.

మిడిల్స్ బ‌రోలో జెస్సీకా.. మితేష్ దంప‌తులు మూడేళ్లుగా ఫార్మ‌సీ న‌డుపుతున్నారు. వీరిది ప్రేమ వివాహం. యూనివ‌ర్సిటీ ఆఫ్ మాంచెస్ట‌ర్ లో చ‌దువుకునే రోజుల్లో వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. అనంత‌రం వారిరువురూ పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో ఉన్న జెస్సికాను వెంటాడి మ‌రీ హ‌త్య చేసిన‌ట్లుగా అనుమానిస్తున్నారు.

జెస్సికా మృతికి కార‌ణాల్ని అప్పుడే తాము చెప్ప‌లేమ‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఎవ‌రికేం తెలిసినా త‌మ దృష్టికి తీసుకురావాల‌ని స్థానిక పోలీసులు కోరుతున్నారు. హ‌త్య‌కు కార‌ణ‌మైన ఆగంత‌కుల కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు. హ‌త్య‌కు గురైన జెస్సికా ఇంటి వ‌ద్ద ర‌ద్దీ ఎక్కువ‌గా ఉన్న కార‌ణంగా ఆధారాలు సేక‌రించ‌టం క‌ష్టం మారిన‌ట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News