ముకేశ్ అంబానీ సత్తా ఎంతన్నది చాటే ఉదంతాలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. రిలయన్స్ ను రుణరహిత కంపెనీగా మార్చాలన్న భారీ టార్గెట్ పెట్టుకున్న ఆయన.. తన అమ్ములపొదిలోని జియోలో వాటాల్ని అమ్మేందుకు ముందుకు రావటం.. దాన్లో వాటాలు కొనుగోలు చేసేందుకు పెద్ద పెద్ద కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించటం తెలిసిందే.
ప్రపంచమంతా ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నా.. లాక్ డౌన్ నడుస్తున్నా కూడా జియోతో డీల్ కుదుర్చుకునేందుకు కంపెనీలు మాత్రం ఆసక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. నాలుగు వారాల్లో నాలుగు డీల్ తో అదరగొట్టేస్తున్నారు ముకేశ్ అంబానీ. తాజాగా జియోలో 1.34 శాతం వాటా కోసం రూ.6598 కోట్లతో డీల్ కు ఓకే అయింది. ఇందుకోసం అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ.. జనరల్ అట్లాంటిక్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.
ఇప్పటివరకూ జియోలో 9.99 శాతం వాటా కోసం ఫేస్ బుక్ రూ.43,574 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైతే.. సిల్వర్ లేక్ సంస్థ 1.15 శాతం వాటా కోసం రూ.5666 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మధ్యనే 2.32 శాతం వాటా కోసం విస్టా ఈక్విటీ పార్టనర్స్ రూ.11,367 కోట్లతో భారీ ఒప్పందం ఫైనల్ కాగా.. వారం వ్యవధిలోనే జియోలో 1.34 శాతం వాటా కోసం జనరల్ అట్లాంటిక్ సంస్థ రూ.6598 కోట్ల ఒప్పందానికి ముందుకు వచ్చింది.
ఈ నాలుగు డీల్ తో జియోలో ఇప్పటి వరకూ 14.8 శాతం వాటాను అమ్మారు. రానున్న రోజుల్లో మరో 20 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. రిలయన్స్ కంపెనీని అప్పులేని కంపెనీగా మార్చేందుకు వచ్చే ఏడాది మార్చిని టార్గెట్ గా పెట్టుకుంటే.. ఇప్పుడున్న జోరును చూస్తే.. ఈ ఏడాది చివరి నాటికే తన లక్ష్యానికి ముకేశ్ అంబానీ చేరుకుంటారన్న అంచనా వ్యక్తమవుతోంది. ముకేశా.. మజాకానా?