రూ.30వేల కోట్ల బకాయిల్ని కేంద్రానికి చెల్లించిన జియో

Update: 2022-01-19 09:30 GMT
ఏమైనా అంబానీ అంబానీనే. మిగిలిన కంపెనీలకు భిన్నంగా వ్యవహరించే రిలయన్స్.. ఆ సంస్థకున్న బలమైన ఆర్థిక మూలాల గురించి తెలిసిందే. ఆర్థికంగా ఎంత బలమైన కంపెనీ అయినా.. రూ.30వేల కోట్ల భారీ మొత్తాన్ని అప్పులో భాగంగా చెల్లించటం అంటే అంత తేలికైన విషయం కాదు. కానీ.. అలాంటి అరుదైన ఫీట్ ను విజయవంతంగా పూర్తి చేశారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. ఎంతటి పెద్ద కంపెనీ అయినా.. సంస్థకు ఉన్న బకాయిల్ని తీర్చే విషయంలో కాస్తంత త్రోటుపాటుకు గురవుతూ ఉంటుంది. అందుకు భిన్నంగా రిలయన్స్ వ్యవహరించింది.

స్పెక్ట్రాం కేటాయింపులకు సంబంధించి రూ.30,791 కోట్ల బకాయిలను ప్రభుత్వానికి చెల్లించినట్లుగా పేర్కొంది. మార్చి 2021 ముందు జరిగిన స్పెక్ట్రం వేలానికి సంబంధించి వడ్డీతో సహా అన్నిబకాయిల్ని చెల్లించినట్లుగా స్పష్టం చేసింది. 2014, 2015, 2016తో జరిగి స్పెక్ట్రం కేటాయింపుల్లో జియోకు చేశారు. అదే సమయంలో 2021లో భారతి ఎయిర్ టెల్ తోనూ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

ఈ డీల్ లో భాగంగా  జియో 585.3 ఎంహెచ్ జెడ్ స్పెక్ట్రం సొంతం చేసుకుంది. దీనికిసంబంధించిన చెల్లింపుల్ని తాజాగా చేసినట్లుగా కంపెనీ పేర్కొంది. తాజా చెల్లింపుల కారణంగా కంపెనీకి ప్రతి ఏటా రూ.1200 కోట్లు మిగలనున్నట్లు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ భారీ మొత్తాన్ని చెల్లించటానికి నాలుగేళ్ల సమయాన్ని ఇచ్చింది. కానీ.. జియో మాత్రం తాజాగా మొత్తం బకాయిల్ని క్లియర్ చేయటం గమనార్హం.

ఈ స్పెక్ట్రంకు సంబంధించి బకాయిల్ని భారతీ ఎయిర్ టెల్ సైతం చెల్లించింది. గత నెలలో సదరు సంస్థ రూ.15,519 కోట్ల మొత్తాన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాంకు చెల్లించింది. ఇదే తరహాలోబకాయిలు పడిన వోడాఫోన్ ఐడియా.. టాటా టెలీ సర్వీసెస్ .. టాటా టెలీ సర్వీసెస్ మహారాష్ట్రలు మాత్రం ప్రభుత్వం ఇచ్చిన మారిటోరియంను ఉపయోగించుకోవటానికి ముందుకు వచ్చాయి.

వోడా ఫోన్ఐడియా అయితే.. తాను చెల్లించాల్సిన బకాయిలపై ఉన్న వడ్డీని చెల్లించటానికి ప్రభుత్వానికి ఈక్విటీ వాటా ఇస్తామని ఆఫర్ చేయటం తెలిసిందే. మొత్తంగా చూసినప్పుడు నాలుగేళ్లలో చెల్లించాల్సిన భారీ మొత్తాన్ని ముందే చెల్లించటేయటం ద్వారా.. జియో ఆర్థిక మూలాలు ఎంత బలంగా ఉన్నాయన్నది స్పష్టం చేస్తుందని చెప్పాలి.
Tags:    

Similar News