మళ్లీ జోబైడెన్.. 2024 అధ్యక్ష బరిలోకి..

Update: 2023-02-28 17:57 GMT
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇప్పటికే వృద్ధాప్యంతో బాధపడుతున్నాడు. ఇప్పటికే ఆయన వయసు 80 ఏళ్లు. మతిమరుపు సమస్య వెంటాడుతోంది. అలాంటి బైడెన్ మరోసారి ఎన్నికల బరిలో దిగడని.. ఈసారి వేరే అభ్యర్థిని పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అనూహ్య ట్విస్ట్ వచ్చింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మరోసారి 2024 ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారని అమెరికన్లు తెలుసుకోవాలని ఆయన సతీమణి, ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ తెలిపారు. తాను కూడా మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.  

వయోభారం కారణాలతో 2024 ఎన్నికల నుంచి జోబైడెన్ వైదొలుగుతారనే ప్రచారాన్ని జిల్ కొట్టిపారేశారు. బైడెన్ త్వరలోనే తన ప్రచార కార్యక్రమాల వివరాలను వెల్లడిస్తారని భావిస్తున్నట్టు సమాచారం. తాను కూడా దానికి మద్దతుగా నిలుస్తానని వెల్లడించారు.

డెమొక్రటిక్ పార్టీ సభ్యుల మద్దతుతో జోబైడెన్ 2024లో మళ్లీ బరిలో నిలవడంపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా నిలిచిన ఆయనకు ఓటర్లు మరోసారి అవకాశం ఇస్తారా? అన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. జోబైడెన్ స్వయంగా చాలాసార్లు తిరిగి ఎన్నికల బరిలో నిలవాలన్న కోరికను వ్యక్తం చేశాడు. వయసు ప్రభావం కాదన్నారు. జోబైడెన్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఈ ఏడాది మొదట్లో రహస్య పత్రాల వివాదంలో బైడెన్ చిక్కుకున్నాడు. ఆ తర్వాత విదేశీ వ్యవహారలతో బిజీ అయ్యారు. మార్చి లేదా ఏప్రిల్ లో ఆయన ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు. జోబైడెన్ బరిలోకి నిలిచే విషయంలో నిర్ణయాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల్లో జిల్ ఒకరు అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News