జో బైడెన్​ జీవితమంతా ఆటుపోట్లే..ప్రేమపెళ్లి అంతలోనే విషాదం..అడగడుగునా అవమానాలు!

Update: 2020-11-08 04:30 GMT
ట్రంప్​ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఎగ్జిట్​పోల్స్​ లెక్కలను నిజం చేస్తూ అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​ సగర్వంగా ఎన్నికయ్యారు.  సౌమ్యుడిగా, అన్నివర్గాల ప్రజలకు అనుకూలుడిగా, ప్రజాస్వామ్యవాదిగా పేరున్న జో బైడెన్​ జీవితమంతా పూలపాన్పు మాత్రం కాదు. ఎన్ని ఒడిదొడుకులు, విషాదాలు, అవమానాలతో ఆయన ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చారు. 46వ అమెరికా అధ్యక్షుడిగా 77 ఏళ్ల వయస్సులో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై కొత్త రికార్డులను నెలకొల్పారు. సుదీర్ఘరాజకీయం అనుభవంలో ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఆరుసార్లు సెనేటర్​గా ఎన్నికైన జో బైడెన్​ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో విషాదకర ఘటనలు ఉన్నాయి.

చిన్నప్పుడే అవమానాలు

జో బైడెన్​కు చిన్నతనంలో సరిగ్గా మాటలు పలికేవి కావు. నత్తి సమస్య ఆయనను ఎంతో వేధించింది. ఆ తర్వాత ఆయన అద్దం ముందు నిలుచుని సరిగ్గా మాట్లాడేందుకు ఎంతో యత్నించేవారు. చివరకు అందరిలాగే మాట్లాడగలిగారు.
ఆయనకు 13 ఏళ్ల వయసు ఉన్న సమయంలో వారి కుటుంబం తమ స్వస్థలం పెన్సిల్వేనియా నుంచి డెలావర్‌లోని మేఫీల్డ్‌కు (1955) వలస వెళ్లింది. జో అక్కడ కొత్త స్కూల్లో చేరాడు. తోటి విద్యార్థులు అతడిని ‘డాష్‌’ అంటూ గేలి చేశారు.

న్యాయ విద్యను పూర్తిచేసిన బైడెన్ కోర్టులో అనర్గళంగా వాదించాడు. తన వాక్పటిమ, పనితీరుతో తన చుట్టూ ఉండేవారిని ఆకర్షించాడు. 29 ఏళ్ల వయస్సులోనే సెనేటర్‌గా ఎంపికయ్యారు. బరాక్ ఒబామా హయాంలో అమెరికాకు ఉపాధ్యక్షుడయ్యారు.

ప్రేమ.. అంతలోనే విషాదం  

సిరాక్యూస్‌ యూనివర్సిటీలో చదువుతున్న నీలియా హంటర్‌ను 1966లో బైడెన్ ప్రేమించి పెళ్లిచేసికున్నారు. అప్పటికే ఆయన డెమొక్రటిక్‌ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. నీలియా, బైడెన్‌ దంపతులకు ముగ్గురు పిల్లలు జన్మించారు. వారి పేర్లు జోసఫ్‌ (బ్యూ), హంటర్‌, నవోమీ (అమీ). వ్యక్తిగత జీవితం సాఫీ సాగుతున్న సమయంలో ఆయన జీవితంలో అనుకోని విషాధం చోటుచేసుకున్నది. 1972 రోడ్డు ప్రమాదంలో బైడెన్ భార్య నీలియా, ఏడాది వయసున్న కుమార్తె అమీ మరణించారు. కుమారులు బ్యూ, హంటర్ తీవ్రంగా గాయపడ్డారు. పిల్లలు హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండటంతో వాషింగ్టన్‌ లో జరిగిన సెనేటర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి బైడెన్ వెళ్లలేదు. ప్రత్యేక అనుమతి తీసుకొని హాస్పిటల్ గదిలోనే ప్రమాణ స్వీకారం చేశారు.

బైడెన్ రెండో పెళ్లి

1977లో రాజకీయాల్లో తీరిక లేకుండా గడుపుతున్న సమయంలో బైడెన్‌కు జిల్‌ ట్రేసీ జాకబ్స్‌ అనే టీచర్‌ పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం బైడెన్ వెంట కనిపిస్తున్న మహిళ జాకబ్సే. ఆమె తన ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డారని బైడెన్ చెబుతారు.

జో బైడెన్.. అమెరికాలోని పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్‌‌ లో 1942 నవంబర్‌ 20న ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జోసఫ్‌ ఓ చిరుద్యోగి. తల్లి కేథరిన్‌ గృహిణి. మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆ తల్లిదండ్రులు బైడెన్‌ను ఎలాంటి కష్టాలనైనా తట్టుకొని నిలబడే మనిషిగా తీర్చిదిద్దారు. అదే ఆయన ఓ పరిపూర్ణ వ్యక్తిగా, మంచి రాజకీయ నాయకుడిగా ఎదగడానికి దోహదపడింది. ఇప్పుడు అమెరికాకు కొత్త దారిని చూపెట్టబోతోంది..!

బైడెన్​ లవ్​ స్టోరీ ఎంతో ఆసక్తికరం..   బైడెన్​ ప్రేమను ఐదుసార్లు తిరస్కరించిన జిల్​

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ వ్యక్తిగత జీవితం ఎంతో విషాదభరితంగా, ఆసక్తికరంగా కూడా సాగింది. అతడు తన ప్రేమను తిరస్కరించిన ఓ యువతి కోసం పదే పదే ప్రాదేయపడి మరీ పెళ్లి చేసుకున్నాడు. బైడెన్​ రెండో భార్య జిల్​.. అతడిని ప్రేమను అంత తేలిగ్గా అంగీకరించలేదు. ఐదుసార్లు అతడి ప్రేమను సున్నితంగా తిరస్కరించి.. ఆరోసారి కనికరించింది. అంటే బైడెన్​ ఏ విషయంలోనైనా పట్టువదలని విక్రమార్కుడే అన్నమాట. నిజానికి బైడెన్​ జీవితం బాల్యం నుంచే విషాదభరితంగా సాగింది. మొదటి భార్య, నెలలు కూడా నిండని కూతురు ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం అతడి జీవితంలో పెను విషాదమనే చెప్పాలి.. మొదటి భార్య పోయాక బైడెన్​ జిల్​ను ప్రేమపెళ్లి చేసుకున్నాడు.

ఫిలడెల్పియాకు చెందిన జిల్​ 1951లో జన్మించారు. 1970లో బిల్​ స్టీవెన్సన్​ను వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల  తర్వాత వ్యక్తిగత కారణాలతో ఆయనతో విడిపోయారు. 1975లో తొలిసారి జిల్​.. ఓ యూనివర్సిటీలో జో బైడెన్​ను కలిశారు. అప్పుడే వీరి ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. అప్పటికీ బైడెన్​ వివాహితుడు. అయితే బైడెన్​ది విషాథగాథ. ఆయన భార్య నీలియా 1972లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఆ ప్రమాదంలో ఆమె ఏడాది పాపకూడా చనిపోయింది. ఇద్దరు కుమారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని ఆయనే బైడెన్​ చూసుకుంటున్నారు.

ఈ క్రమంలో బైడెన్​ జిల్​ ముందు పెళ్లి ప్రతిపాదన పెట్టారు. ఆప్పడు ఆమె సున్నితంగా తిరస్కరించారు.
జిల్​ నుంచి బైడెన్​కు ఐదుసార్లు తిరస్కరణ ఎదురైంది. అయితే చివరకు ఆమె అంగీకరించింది. దీంతో 1977లో వారు వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వారి వివాహ బంధం నిరాటంకంగా కొనసాగుతున్నది.  జిల్​ డాక్టరేట్​ చేశారు. వృతి రీత్యా ఆమె టీచర్​. మొదట 13 ఏళ్లపాటు వివిధ పాఠశాలల్లో ఆమె ఇంగ్లీష్​ టీచర్​గా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని కళాశాలల్లో కూడా పనిచేశారు.

బైడెన్​  ఉపాధ్యక్షుడు అయిన తర్వాత ఆమె అమెరికా ద్వితీయ మహిళ స్థానం పొందారు. దాంతో ఆమె వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చేది. అయినా ఆమె బోధన వృత్తిని వదిలిపెట్టలేదు. తన భర్తకు అధ్యక్ష పదవి దక్కినా కూడా తాను పాఠాలు చెబుతూనే ఉంటానని ఆమె చెప్పారు.  నీలియా మరణం తర్వాత తాను ఎంతో కుంగిపోయానని బైడెన్​ జిప్పారు. జిల్​ తనను మామూలు మనిషిని చేసిందని బైడెన్​ అంటుంటారు. తనకు తన జీవితాన్ని ఆమె తిరిగి ఇచ్చిందని బైడెన్​ ఎప్పుడూ చెబుతుంటారు.
Tags:    

Similar News