జనవరి 20 న అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి ప్రెసిడెన్షియల్ ఇనాగ్యురేషన్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 20న జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ పాప్ సింగర్ లేడీ గగా, ప్రఖ్యాత సింగర్ జెన్నీఫర్ లోఫెజ్, అమెరికన్ కవయత్రి అమండా గోర్మాన్ ప్రదర్శన ఇవ్వనున్నట్టు ప్రెసిడెన్షియల్ ఇనాగ్యురేషన్ కమిటీ గురువారం ప్రకటించింది.
ముందుగా 1989 నుంచి 2001 వరకు జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడిగా ఉన్న జెసూట్ కాథలిక్ ప్రిస్ట్ ఫాదర్ లియో జె ఓ డోనోవన్ చేత ఆహ్వానం కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫైర్ ఫైటర్స్ లోకల్ 3920 అధ్యక్షురాలిగా ఉన్న ఆండ్రియా హాల్ చేతుల మీదుగా ప్రతిజ్ఞ కార్యక్రమం ఉండనుంది. ఆమె జార్జియాలో 20 ఏళ్లకు పైగా ఫైర్ ఫైటర్ గా సేవలు అందించారు. కెప్టెన్ గా పదోన్నతి పొందిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళగా నిలిచారు.
జాతీయ గీతాన్ని లేడీ గగా అలపించనున్నారు. లేడీ గగా పరోపకారిగా పేరు తెచ్చుకోవడంతో పాటు, మెంటల్ హెల్త్‌కు సంబంధించిన అంశాలపై, LGBTQ వర్గాల హక్కుల పోరాటలకు, హెచ్‌ఐవీ అవగాహనకు ఆమె మద్దుతుగా నిలిచారు. ఒబామా అడ్మినిస్ట్రేషన్ సమయంలో కాలేజ్ ప్రాంగణాల్లో సెక్సువల్ వేధింపులను పరిష్కరించడానికి ఎన్నుకున్న బైడెన్ కమిటీతో కలిసి లేడీ గగా పనిచేశారు. అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడిగా జో బైడెన్ , ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనం వెస్ట్ ఫ్రంట్ లో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో 10వేల మంది నేషనల్ గార్డులను వాషింగ్టన్ లో పహారాకు నియమించారు. ప్రమాణ స్వీకారం అనంతరం జరిగే పరేడ్ కూడా వర్చువల్‌గానే ఉంటుందని ప్రమాణ స్వీకార కమిటీ ప్రకటించింది.