ఈసారి మళ్లీ పోటీకి రెడీ అవుతున్న జోబిడెన్

Update: 2023-04-25 17:00 GMT
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మరోసారి ఎన్నికల కదనరంగంలోకి దూకడానికి రెడీ అయ్యారు.   వైట్‌హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సోమవారం బిడెన్ విలేకరులతో మాట్లాడారు. "నేను ఈ వయసులోనూ పరుగెత్తడానికి ప్లాన్ చేస్తున్నాను. మరోసారి పోటీచేస్తాను" అని స్పష్టం చేశారు. మీకు త్వరలో తెలియజేస్తాను అంటూ రిపోర్టర్లకు హింట్ ఇచ్చాడు.

ఈ వారంలోనే డెమొక్రాట్ల తరుఫున తన ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభిస్తారని అమెరికా మీడియా,  రాజకీయ పండితులు భావిస్తున్నారు.  బిడెన్ , అతని బృందం వీడియో రూపంలో ప్రకటన చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

సీనియర్ వైట్ హౌస్ అధికారి ,  దీర్ఘకాల డెమోక్రటిక్ పార్టీ కార్యకర్త జూలీ చావెజ్ రోడ్రిగ్జ్ బిడెన్ యొక్క తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని తెలిపారు.

2020 ఎన్నికలలో బిడెన్ చేతిలో ఓడిపోయిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇప్పటికే ప్రచారం ప్రారంభించేశాడు.  2024 రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి తన అభ్యర్థిత్వాన్ని గత ఏడాది నవంబర్‌లో ప్రకటించారు.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024న జరగాల్సి ఉంది.  జాతీయ పోల్ ప్రకారం 51 శాతం మంది డెమొక్రాట్‌లతో సహా మొత్తం అమెరికన్లలో 70 శాతం మంది బిడెన్ రెండోసారి పోటీ చేయకూడదని భావిస్తున్నారు.

80 ఏళ్ల బిడెన్ ఈ వయసులో అమెరికా అధ్యక్షుడిగా కష్టమని.. ఆయన మతిపరుపు ఎక్కువగా ఉందని.. ఇంకా పరుగెత్తకూడదని అభిప్రాయపడ్డారు. దాదాపు సగం మంది అతని వయస్సును "ప్రధాన" కారణంగా పేర్కొన్నారు.

ట్రంప్ విషయానికొస్తే, రిపబ్లికన్లలో మూడవ వంతుతో సహా 60 శాతం మంది అమెరికన్లు 2024లో రిపబ్లికన్ తరుఫున ట్రంప్ పోటీ చేయరాదని నమ్ముతున్నారు.  "సీక్వెల్స్ తరచుగా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతాయి, కానీ స్పష్టంగా బ్యాలెట్ బాక్స్ వద్ద కాదు" అంటూ ట్రంప్ ఓడిపోతారని రిపబ్లికన్ ముఖ్యనేతలే అంటున్నారు.  "ప్రజలు బిడెన్-ట్రంప్ రీమ్యాచ్‌ను కోరుకోవడం లేదు" అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News