అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ వలసదారులకు శుభవార్త చెప్పడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా హెచ్1బీ వీసాలపై ఆంక్షల ఎత్తివేతతోపాటు వలసదారులకు పౌరసత్వం ఇస్తానని జోబైడెన్ హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
దాదాపు 1.10 కోట్ల మందికి అమెరికా పౌరసత్వం ఇచ్చేలా జోబైడెన్ తన ప్రణాళికలను రూపొందిస్తున్నారని బైడెన్ ప్రచార బృందం రిలీజ్ చేసిన డాక్యుమెంట్ పేర్కొంది.
వీరిలో 5 లక్షలమంది భారతీయులు ఉన్నారని తెలిపింది.కాగా అమెరికాలో ఉంటున్న కొంతమందికి పౌరసత్వం ఉండి.. వారి సంతానానికి పౌరసత్వం లేకపోవడంతో తల్లిదండ్రులు, పిల్లలు వేర్వేరుగా ఉండాల్సి వస్తోంది. ఇప్పుడు బైడెన్ అమలు చేస్తే ఆ కష్టాలు తీరుతుంది.
జోబైడెన్ ప్రధానంగా విదేశీ వలసల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. హెచ్1 బీ ఆంక్షలు ఎత్తివేస్తానన్నారు. మునుపటిలా అమెరికాలో విదేశీ నిపుణులకు బార్లా తెరువనున్నారు. ఈ క్రమంలోనే భారీగా విదేశీయులకు పౌరసత్వం ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.