లిమ్కా బుక్ లోకి ఎంపీ సంతోష్

Update: 2023-04-06 06:00 GMT
గ్రీన్ ఇండియా సృష్టికర్త.. బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కు తను చేపట్టిన పచ్చదనానికి ఫలితం దక్కింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట మొక్కలను పెంచడమే ధ్యేయంగా పెట్టుకున్న సంతోష్ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మక లిమ్కా  బుక్ ఆఫర్ రికార్డ్స్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్థానం దక్కించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల అపార కృషిని నిక్షిప్తం చేసే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్తగా సంతోష్ కు చోటు లభించింది.

లిమ్కా బుక్ కోసం సంతోష్ మరో బృహత్తర పనికి పూనుకున్నారు. అత్యధిక మొక్కలు నాటించే కార్యక్రమాన్ని చేపట్టారు.  ఈ కార్యక్రమం సక్సెస్ కావడంతో సంతోష్ కు లిమ్కా బుక్ రికార్డ్స్ లో చోటు కల్పించినట్టు నిర్వాహకులు, లిమ్కా బుక్ ెడిటర్ వత్సాల కౌల్ బెనర్జీ వెల్లడించాడు. ఈ మేరకు ప్రశంస పత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఎంపీకి అందించినట్టు ప్రకటించారు.

ఆదిలాబాద్ జిల్లా దుర్గానగర్ లో 2021 జులై 4న సంతోష్ కుమార్ ప్రత్యేక చొరవతో ఒక గంటల సమయంలో 16900 మంది భాగస్వాములతో 354900 మొక్కలు నాటినట్లు సంస్థ తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ 21 మొక్కలు నాటినట్లు ఆ సంస్థ పేర్కొంది. సమష్టి కృషి, సామాజిక సృహకు ఈ కార్యక్రమం నిలువెత్తు నిదర్శనమని ప్రశంసించింది.

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు చోటు లభించడం.. సీఎం చేతుల మీదుగా రికార్డ ప్రతిని అందుకోవడం తనపై మరింత బాధ్యత పెంచిందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. లిమ్కా బుక్ లో చోటు దక్కడానికి ప్రధాన కారణం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అని తెలిపారు. కేసీఆర్ స్ఫూర్తితో జోగురామన్న తన పుట్టినరోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలనే సంకల్పం తీసుకొని ఒక గంటలోనే 3.5 లక్షల మొక్కలు నాటించారని చెప్పారు. రామన్నకు, ఆయన బృందానికి సంతోష్ కుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News