రేవంత్ మాటే బీజేపీ అగ్రనేత నోటి నుంచా?

Update: 2023-06-26 17:00 GMT
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా అభివర్ణించే ధరణిపై విపక్షాలు విమర్శలు చేయటం  తెలిసిందే. ధరణిపై తొలిసారి యుద్ధాని షురూ చేసివారి కంటే కూడా.. రాజకీయ పార్టీలు ఈ ఇష్యూను ఒకరికి మించి మరొకరు మాట్లాడటం ద్వారా.. ధరణి ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా అద్భుతాలు చేసినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెబితే.. ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణంగా విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూములు మొత్తాన్ని రికార్డు చేసినట్లుగా చెప్పి.. దీని కారణంగానే రైతుబంధు చాలా తేలిగ్గా జరుగుతుందని చెబుతుంటే.. ధరణి పోర్టల్ ను ఒక ప్రైవేటు సంస్థ చేతుల్లో ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాధానాలు ప్రభుత్వం నుంచి రాలేదు. ధరణిని వ్యతిరేకిస్తూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవటమే కాదు.. రేవంత్ రెడ్డి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు.

ఎన్నికల్లో తాము గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంతనే ధరణిని రద్దు చేస్తామన్న సంచలన ప్రకటనను రేవంత్ రెడ్డి చేయగా.. తాజాగా అదే మాటను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటివరకు ధరణి మోసాల గురించి రేవంత్ పదే పదే ప్రస్తావించినప్పటికీ మిగిలిన పార్టీలు పెద్దగా రియాక్టు అయ్యింది లేదు. అందుకు భిన్నంగా ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి నోటి నుంచే ధరణి గురించి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని.. రైతుల భూముల్ని లాక్కునేందుకు.. కార్యకర్తల జేబులు నింపేందుకు ధరణి పోర్టల్ తీసుకొచ్చారన్నారు. తాము అధికారంలోకి వచ్చినంతనే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామన్న ఆయన.. అమరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రం వెనుకబాటుకు గురి కాగా.. ఒకే ఒక కుటుంబం బాగుపడిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆరర్.. ఆయన కుమారుడు.. కుమార్తె లాభపడ్డారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణకు 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పిన నడ్డా.. అందులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్నారు. ఈ వ్యవహరాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు పంపించాలన్నారు. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని నడ్డా ప్రకటించటం ద్వారా ఇంతకాలం రేవంత్ చేస్తున్న పోరాటానికి కొత్త గుర్తింపు వచ్చినట్లుగా చెప్పక తప్పదు.

Similar News