అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రపంచాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన రెండు రోజులుగా అమెరికా అధ్యక్ష ఫలితాల మీదనే మీడియా.. సోషల్ మీడియా పోకస్ అంతా. రాజకీయ నేతల్లోనూ ఈ ఫలితాల వేడి బాగానే తాకినట్లుంది. తాజాగా బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమికి కారణాల్ని వెల్లడిస్తూ సంచలనంగా మారారు.
కరోనా వైరస్ ను సరిగా హ్యాండిల్ చేయని కారణంగానే ట్రంప్ ఓటమి పాలు అవుతున్నట్లు చెప్పారు. బిహార్ లోని దర్బాంగాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ వైఫల్యాల్ని ఆయన ఏకరువు పెట్టారు. ‘‘అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ట్రంప్ పై ఆరోపణ ఏమంటే.. ఆయన కోవిడ్ -19ను సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు. మోడీజీ సకాలంలో నిర్ణయాలు తీసుకొని.. దేశాన్ని.. దేశ ప్రజల్ని కాపాడారు. కరోనా విషయంలో ట్రంప్ చాలానే విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి బైడెన్.. ఈ వైఫల్యాన్నే ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
ట్రంప్ వైఫల్యం గురించి చెబుతున్ననడ్డా.. ప్రధాని మోడీ మాత్రం కరోనాను బాగా డీల్ చేసినట్లు చెప్పుకోవటం బాగున్నా.. పలువురు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే.. మోడీ అంత బాగా కంట్రోల్ చేసి ఉంటే.. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన రెండో దేశన్న చెత్త రికార్డు ఎందుకు సొంతమవుతుందని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా వలస కూలీల్ని వందలాది కిలోమీటర్లు నడిపించింది మోడీ సర్కారు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ లోపాల్ని ఎత్తి చూపించటం బాగానే ఉన్నా.. ఆ పేరుతో మోడీని వెనకేసుకురావటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్న మాట వినిపిస్తోంది.