ట్రాఫిక్ లో బోరు కొట్టి.. వంతెన నుండి మొసళ్ల నదిలోకి దూకాడు, ఆ తర్వాత ..!
ట్రాఫిక్ లో ప్రయాణం చేయడం అంటే అనుకున్నంత సులువు కాదు. ట్రాఫిక్ లో వెళ్లాలంటే చాలామందికి చిరాకు. ఒక్కసారి ట్రాఫిక్ లో చిక్కుకుంటే ముందుకు వెళ్లేలేక, వెనక్కి తిరగలేక గంటలు తరబడి వేచి చూడటమంటే ఎవరికైనా నరకమే. అంతసేపు ట్రాఫిక్‌లో టైంపాస్ చేయడం కూడా కష్టమే. అలాగని మన వాహనాలను రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోలేము. అయితే, లుసియానాలో ఓ యువకుడు ట్రాఫిక్ లో బోరు కొట్టిందని చెప్పి, పక్కనే ఉన్న వంతెన మీద నుంచి నదిలోకి దూకేశాడు. ఆ తర్వాత అందులో ఈదలేక నరయాతన అనుభవించాడు.
ఇందులో మరో విస్తుపోయే వాస్తవం ఏమిటంటే , అతడు దూకిన నదిలో మొసళ్లు ఎక్కువగా ఉంటాయట. వివరాల్లోకి వెళ్తే .. జిమ్మీ ఇవాన్ జెన్నింగ్ అనే 26 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి కారులో షికారు చేస్తున్నాడు. బాసిన్ బ్రిడ్జ్ మీద కారు ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
ఎన్ని గంటలైనా ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో విసిగిపోయిన జెన్నింగ్, ఇక నేను ఆగలేను. నదిలోకి దూకి వెళ్లిపోతానని ఫ్రెండ్స్ అన్నాడు. అయితే, అతడు జోక్ చేస్తున్నాడేమో అనుకున్నారు. అతడు వంతెన మీద నుంచి నదిలోకి దూకుతుంటే వీడియో తీశారు. జెన్నీ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి అచ్చఫాలయ నదిలోకి దూకాడు.
ఆ నదిలో కరెంట్ ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈదడానికి ఇబ్బందిపడ్డాడు. కొద్ది నిమిషాల తర్వాత అతడు మళ్లీ కనిపించలేదు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అత్యవసర సేవల సిబ్బందిని రంగంలోకి దించారు. ఆ నదిలో మొసళ్లు సంచరిస్తాయనే సంగతి తెలిసి అధికారులు అతడు సంజీవంగా బయటపడతాడా లేదా అనే అనుమానం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత పెద్ద సీన్ జరిగింది. జెన్నీ కాసేపు ప్రవాహంతోపాటు ఈత కొడుతుండగా అతడికి ఓ దీవి కనిపించింది. అయితే, అది నగరానికి చాలా దూరంగా ఉంది. అతడి వద్ద ఫోన్ కూడా లేదు.
ఎవరినైనా సాయం అడిగి బోటులో నగరానికి చేరుకుందామని ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో పోలీసులే అతడిని కనుగొన్నారు. అక్కడ అతడిని అరెస్టు చేసి హాస్పిటల్‌కు తరలించారు. డ్రగ్స్ ప్రభావంతో నదిలోకి దూకాడనే అనుమానంతోనే పోలీసులు హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిసింది. ఎట్టకేలకు అతడు క్షేమంగా బతికి బయటపడ్డాడు.
కాబట్టి మీకెప్పుడైనా ట్రాఫిక్‌లో బోరు కొడితే జెన్నీలా మాత్రం చేయకండి. అతడి అదృష్టం బాగుంది కాబట్టి బయటపడ్డాడు. తాను అలా చేయడం చాలా పెద్ద పొరపాటు అని జెన్నీ ఆ వీడియోను తన ఫేస్ బుక్ పేజీ లో కూడా పోస్ట్ చేశాడు.