కాలం చెల్లిన ర్యాగింగ్ కు పాల్పడితే ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం తరచూ చెబుతూ ఉంటుంది. అయితే.. జరిగేది మాత్రం జరుగుతూనే ఉంటుంది. తాజాగా అలాంటి దారుణ ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణలోని సూర్యాపేటలోని మెడికల్ కాలేజీకి చెందిన మెడికోలు చేసిన దారుణ ర్యాంగింగ్ గురించి తెలిస్తే నోట వెంట మాట రాదంతే. హైదరాబాద్ కు చెందిన బాధిత విద్యార్థి సూర్యాపేట మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఇంటికి వెళ్లిన అతడు శనివారం రాత్రి హాస్టల్ కు చేరుకున్నాడు. అప్పటికే సెకండ్ ఇయర్ చదువుతున్న పాతిక మంది మెడికోలు మద్యం తాగి ఉన్నారు. జూనియర్ విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు. తాము చెప్పినట్లుగా వినాలని హెచ్చరిస్తూ.. తమ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ అతడి దుస్తులు విప్పించి సెల్ ఫోన్ లో వీడియో తీశారు. అనంతరం అతడికి గుండు గీసే ప్రయత్నం చేశారు. దీంతో.. ప్రతిఘటించిన సదరు విద్యార్థి వారి నుంచి తప్పించుకొని తన రూంకు వెళ్లాడు.
అనంతరం తండ్రికి ఫోన్ చేసిన తనకు ఎదురైన పరిస్థితి గురించి చెప్పాడు. దీంతో.. బాధితుడు తండ్రిడయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. స్పందించిన స్థానిక పోలీసులు హాస్ట్లల్ కు చేరుకొని టెన్షన్ లో ఉన్న బాధితుడ్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదే సమయంలో ర్యాంగింగ్ చేసిన వారిపై చర్యలకు పోలీసులు పట్టించుకోవటం లేదని బాధితుడి తండ్రి ఆరోపిస్తున్నారు.
అయితే.. విద్యార్థులు ఘర్షణ పడ్డారని.. ర్యాంగింగ్ కు పాల్పడినట్లుగా ఆధారాలు లేవని.. ఒకవేళ అది నిజమని తేలితే కేసు నమోదు చేయాలని పోలీసులకు చెబుతామని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి చెబుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ర్యాంగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.