ప్రాణమిచ్చేటోళ్లు కేసీఆర్ నే ధిక్కరిస్తున్నారు.

Update: 2020-01-12 11:31 GMT
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు ఎదురేలేదని అనుకున్నారంతా.. కానీ ఇప్పుడు టిఆర్ ఎస్ ఒక ప్రత్యేకమైన సమస్యను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షం కాంగ్రెస్ - బీజేపీలు తెలంగాణలో టిఆర్‌ ఎస్‌ కు సరితూగకపోయినా - పార్టీ గ్రూపుయిజం - రెబల్స్ మాత్రం గులాబీ పార్టీకి శరాఘాతంగా మారుతున్నారట.. టీఆర్ ఎస్ అధికారిక అభ్యర్థులపై పోటీగా  బరిలోకి దిగిన వారే గులాబీ పార్టీకి ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థులుగా మారిపోయారన్న చర్చ సాగుతోంది.  

కేసీఆర్ కు ఎంతో నమ్మకమైన స్నేహితుడు - మాజీ మంత్రి జుపల్లి కృష్ణారావు తన అనుచరులకు టీఆర్ ఎస్ టికెట్లు రాకపోవడంతో మానస్థాపం చెందిన ఆయన టీఆర్ ఎస్ పై పరోక్ష యుద్ధానికే దిగారట..  కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేకే టీఆర్ ఎస్ టిక్కెట్ల పంపిణీ ఇవ్వడం.. తన మద్దతుదారుల టిక్కెట్లను నిరాకరిస్తున్నారని గుర్తించిన జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌లో తిరుగుబాటు అభ్యర్థులను నిలబెట్టడం గులాబీ పార్టీలో కలకలం రేపుతోంది.. మరో విశేషం ఏంటంటే జూపల్లి మద్దతుదారులు ఫార్వర్డ్ బ్లాక్ టిక్కెట్లతో పోటీ చేస్తుండడం విశేషంగా మారింది.

కొల్లాపూర్ లో గులాబీలో అసమ్మతిపై కెసిఆర్ కల్పించుకొని జూపల్లి కృష్ణారావును హైదరాబాద్ పిలిపించి నచ్చజెప్పినప్పటికీ తాను ఏమీ చేయలేనని కుండబద్దలు కొట్టాడట..  

మరో పరిణామంలో, మంత్రి మల్లా రెడ్డి కఠినమైన  సవాల్ ను తన నియోజకవర్గంలో ఎదుర్కొంటున్నారు,  మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి తిరుగుబాటు లేవనెత్తారు. తిరుగుబాటు అభ్యర్థులను బరిలో దింపి మల్లారెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు..

పార్టీలోని అసమ్మతిని కెసిఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు.  అసమ్మతివాదులు పోటీనుంచి తప్పుకొని  అధికారిక అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే అసమ్మతివాదులు కెసిఆర్ పిలుపును పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.  అధినేత విజ్ఞప్తి చేసినప్పటికీ అనేక మున్సిపాలిటీల్లో పోటీకే సై అంటున్నారు.


Tags:    

Similar News