తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రి జూపల్లి సవాలు..!

Update: 2018-04-19 06:14 GMT
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు - ఆ నేతల అనుచవర్గం గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి  టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల వలన మరో పదేండ్లు వరకు అధికారంలోకి రాలేమో అనే భయంతో టీఆర్ ఎస్ శ్రేణులపై అసత్య ఆరోపణలు చేస్తూ తమ పార్టీకి చెందిన ఒక వర్గ మీడియాలో - సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా తాజాగా మంత్రి జూపల్లి వారసులపై సీబీఐ అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియాలో తమ ఫెయిడ్ కార్యకర్తల ద్వారా బురద చల్లే ప్రయత్నాలు చేశారు కాంగ్రెస్ నేతలు.అందులో భాగంగా  మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు అయిన జూపల్లి అరుణ్‌  రిజిస్ట్రేషన్‌ విలువను మార్కెట్‌ విలువ కన్నా అధికంగా చూపాడు. అదీగాకుండా తనఖా పెట్టిన హైకోర్టులో కేసు లో నడుస్తోన్న  కిస్మత్‌ పూర్‌ లోని 3.27 ఎకరాల భూమి మార్కెట్‌ విలువ ప్రకారం రూ.78.48 లక్షలుంటే అరుణ్‌ దాని రిజిస్ట్రేషన్‌ విలువను రూ.3.30 కోట్లుగా చూపాడు. అలాగే గగన్‌ పహాడ్‌ లోని ఇల్లు మార్కెట్‌ విలువ ప్రకారం రూ.1.93 కోట్లు ఉంటే రిజిస్ట్రేషన్‌ లో రూ.2.5 కోట్లుగా చూపించారు.  రూ.17 కోట్ల ఆస్తులు తనఖా పెట్టి రూ.86 కోట్ల రుణం తీసుకొని బ్యాంకులను మోసం చేశారంటూ విషప్రచారం చేశారు.దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ మహానగరంలోని టీఆర్ ఎస్ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమపై వస్తున్నా ఆరోపణలపై  - కాంగ్రెస్ నేతలు చేస్తున్న విషప్రచారంపై అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

ఆయన మాట్లాడుతూ రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. అందుకే తన పిల్లలను టార్గెట్ చేస్తున్నారని ఆయన తెలిపారు . తనను నీరవ్ మోడీతో పోల్చడానికి కాంగ్రెస్ నేతలను సిగ్గుండాలని అన్నారు. తన పిల్లల ప్రతిష్ఠను దెబ్బతీసి వాళ్లు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారన్నారు. పిల్లల భవిష్యత్‌ ను నాశనం చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా నాయకుల అడుగులకు మడుగులొత్తిన చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ నేతలందరినీ దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవి - ఎమ్మెల్యే పదవిని తాను వదులుకున్నానని ఈ సందర్భంగా ఆయన  గుర్తు చేశారు.అప్పు చేసి వ్యాపారం చేయడం తప్పు అవుతుందా అని మంత్రి ప్రశ్నించారు. ప్రుడెన్షియల్ బ్యాంకులో రూ. 6 కోట్ల రుణం తీసుకొని వడ్డీతో సహా చెల్లించామని తెలిపారు. దొంగచాటుగా కాకుండా… చట్టబద్ధంగానే వ్యాపారం చేస్తున్నామన్నారు. తన పిల్లలు ఆయన మీద ఆధారపడకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం సహజమని.. తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా చెల్లిస్తున్నామని చెప్పారు .ఇసుక మాఫియా గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరం. మందిని ముంచిన కాంగ్రెస్ నేతలే తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు..తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా ..నిరూపించకపోతే కాంగ్రెస్ నేతలు తప్పుకుంటారా అంటూ కాంగ్రెస్ నేతలకు సవాలు విసిరారు ..
Tags:    

Similar News