లౌకికత్వం - నాస్తికత్వం పేరుతో పెద్ద ఎత్తున నిరసన గళాలు వినిపించే భారతదేశంలో దేవుడ్ని అస్సలే నమ్మని వారి సంఖ్య ఎంత ఉంటుంది చెప్పండి. 106 కోట్ల మంది జనాభాలో ఎంత తక్కువగా లెక్కేసినా ఓ పాతిక లక్షల మంది ఉంటారు కదా. కానీ మన దేశంలో నాస్తికులు 33 వేల మందేనట. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ లెక్కలు చెప్పింది మరి!
గతంలో ఎప్పుడూ నాస్తికుల సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు. 2001లో చాలా కొద్ది మాత్రమే నాస్తికులు ఉన్నారని చెప్పిందే తప్ప సంఖ్య రూపంలో ప్రకటించలేదు. అయితే 2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం 33వేల మంది నాస్తికులు ఉన్నారు. దేవుడే లేడన్న ప్రతి పది మందిలో ఏడుగురు గ్రామీణ భారతంలోనే ఉండగా...మొత్తం సంఖ్యలో సగం మహిళలే కావడం మరో విశేషం. అత్యధికంగా 9,652 మంది నాస్తికులతో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలవగా.. 9,089 మందితో మేఘాలయ రెండోస్థానం - 4.896 మందితో కేరళ మూడోస్థానంలో ఉన్నాయి. ఢిల్లీలో కేవలం 541 మంది మాత్రమే నాస్తికులు ఉన్నారట. అయితే ఈ సంఖ్య 2012లో జరిగిన గ్లోబల్ రిలిజియోసిటీ ఇండెక్స్ కు పూర్తి విరుద్ధంగా ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి లెక్కల ప్రకారం భారత్ లో 3 శాతం మంది నాస్తికులు ఉన్నారని అంటున్నారు.
గత లెక్కల్లో 3 శాతం నాస్తికులు ఉండగా...తాజాగా చేసిన జనాభా లెక్కల్లో ఈ శాతం 0.0027 శాతం మాత్రమే ఉన్నారని పలువురు ఆశ్చర్యపోతున్నారు. జనాభా లెక్కల సందర్భంగా సుమారు 30 లక్షల మంది తమ మతం వెల్లడించలేదని, అందులోనూ కొంతమంది నాస్తికులు ఉండవచ్చని ఈ లెక్కల్లో తేలింది. గతంలో 66 వేల మంది భారతీయులు తాము నాస్తికులమని చెప్పారు. దాని ప్రకారం చూసుకున్నా ఈ లెక్క సగం మాత్రమే ఉంది. అయితే సెన్సస్ వివరాలను సాధారణంగా ఇంటి పెద్ద ఇస్తారని, అందువల్ల కుటుంబంలో ఒకవేళ నాస్తికులు ఉన్నా వారి వివరాలు బయటకు వచ్చి ఉండకపోవచ్చని మరో అభిప్రాయం వినిపిస్తోంది.