ఆ విషయంలో అందరికి ఆదర్శంగా నిలిచిన గొగోయ్

Update: 2019-11-21 11:02 GMT
కీలక స్థానాల్లో ఉన్న వారు.. అత్యుత్తమ పదవుల్ని చేపట్టిన వారు కొన్ని సిల్లీ విషయాల్లో ప్రదర్శించే కక్కుర్తి కారణంగా వారు విమర్శల్లో చిక్కుకోవటమే కాదు.. అంత పెద్ద మనిషి ఇంత చిన్నతనంగా వ్యవహరించటమా? అన్న సందేహం కలుగక మానదు. అయితే.. అందుకు భిన్నంగా వ్యవహరించటమే కాదు.. అందరికి ఆదర్శంగా నిలిచారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గత వారం పదవీ విరమణ చేసిన ఆయన.. తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. ఢిల్లీలోని కృష్ణమీనన్ మార్గ్ లో బంగ్లాను కేంద్రం కేటాయించింది. సాధారణంగా పదవీ కాలం ముగిసిన వెంటనే ఖాళీ చేయకున్నా.. వారు కొంతకాలం ఉండేందుకు అవకాశం ఉంటుంది.

అందుకు భిన్నంగా ఈ నెల 17న పదవీ విరమణ అయిన గొగోయ్.. మూడు రోజుల వ్యవధిలోనే అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేసి వెళ్లిపోయారు. అత్యుత్తమ స్థానంలో ఉన్న వారు.. తమ పదవీ విరమణ చేసిన మూడు రోజులకే బంగ్లాను ఖాళీ చేసిన అరుదైన వ్యక్తిగా నిలిచారు. ఇప్పటివరకూ మరే సీజేఐ కూడా ఇలా వ్యవహరించలేదని చెబుతున్నారు. తన పదవీ కాలంలో బోలెడన్ని చారిత్రక తీర్పులు చెప్పిన ఆయన వందల ఏళ్ల అయోధ్య వివాదానికి ముగింపు పలికే చారిత్రక తీర్పును వెలువరించటం గమనార్హం.


Tags:    

Similar News