కామెడీగా మాట్లాడినట్లు కనిపించినా.. టీఆర్ ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎంపీ అయిన కవిత మాటలు ఆసక్తికరంగా ఉంటాయి. సోషల్ గా మూవ్ అవుతూ అందరితో కలిసిపోతుంటారు. ఫ్రెండ్లీగా వ్యవహరించే కవితలో సరదా పాళ్లు కాస్త ఎక్కువే. తాజాగా తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డిని కలిశారు. ఆమె బర్త్ డే కావటంతో గ్రీటింగ్స్ చెప్పిన కవిత.. ఆమెకు చీరను బహుకరించారు.
తన బర్త్ డే రోజున ఆడబిడ్డ వచ్చి చీర కొనిచ్చారని.. పురుషులెవరూ బహుమతులు ఇవ్వలేదంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి అంతే సరదాగా బదులిస్తూ.. ‘‘అక్కా.. మీరు సభలో ఛైర్ పై ఉన్నప్పుడు చీర కొట్టు.. మైక్ పట్టు అనే స్కీం పెట్టండి. అప్పుడు మీకు చీరలే.. చీరలు’’ అని వ్యాఖ్యానించారు. దీనికి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవందర్ రియాక్ట్ అవుతూ.. సభలోమైకు ఇస్తే చీర ఇస్తామని సభ్యులు నేరుగా చెబితే బాగుండదు. నాకు అర్థమయ్యేలా సైగ చేస్తే చాలు’’ అని సరదాగా వ్యాఖ్యానించటంతో అక్కడున్న మహిళా ప్రజాప్రతినిధులంతా నవ్వుకున్నారు.
సరదాగా మాట్లాడుకున్న ఈ మాటలు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. కవితక్కకు వచ్చే ఐడియాలు భలే ఉంటాయే అన్న మాట మాట్లాడుకోవటం వినిపించింది. ఏమైనా కవితక్క ఐడియా అదిరిపోయేలా ఉంది కదూ?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/