కరోనా వైరస్ పై దేశం, రాష్ట్రాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఈ సమయంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి ఇష్టానుసారంగా వార్తలు రాస్తూ ప్రజల్లో , వైద్యుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై కేసీఆర్ ఒక మీడియా పై ఫైర్ అవ్వగా.. తాజాగా కేటీఆర్ సైతం ఓ టాప్ మీడియాను ట్విట్టర్ సాక్షిగా కడిగేశారు. తెలుసుకోకుండా వార్తలు రాస్తారా? ఇదేనా జర్నలిజం అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఈ పోస్టు హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణ లో సీఎం కేసీఆర్ రోజురోజు సమీక్షిస్తూ చురుకైన చర్యలు తీసుకుంటున్నారు. కానీ తాజాగా జాతీయ మీడియా ‘ఇండియా టుడే’ దేశంలోనే వైద్యుల రక్షణకు ఉపయోగించే పీపీఈ కిట్స్ తెలంగాణలోనే తక్కువగా ఉన్నాయని వార్త పబ్లిష్ చేసింది. తమ సర్వేలో దేశంలోనే కరోనాతో ఎక్కువ ప్రభావితమైన 12 రాష్ట్రాల్లో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ కు ఉపయోగించాల్సిన ‘పీపీఈ’ కిట్స్ ఎన్ని ఉన్నాయో వెల్లడించింది. తెలంగాణలో కేవలం 3132 మాత్రమే పీపీఈ కిట్స్ ఉన్నాయని.. దేశంలోనే తక్కువ తెలంగాణలోనే ఉన్నాయని ఇండియా టుడే తెలిపింది.
దీని పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ ఇండియాటుడే న్యూస్ డైరెక్టర్ కం యాంకర్ రాహుల్ కన్వాల్ ను ట్విట్టర్ లో కడిగిపారేశారు. ‘రాహుల్, మీకు ఖచ్చితమైన డేటా లేకపోతే అర్థం లేని అభాసుపాలు చేసే విషయాలు ప్రచురించవద్దు. కరోనా టైంలో ప్రజలను గందరగోళానికి గురిచేయకండి.. మా రాష్ట్రంలో పీపీఈ కిట్స్ ఎక్కువ ఉన్నాయని నిరూపిస్తే మీరు క్షమాపణలు చెబుతారా? మీరు చెప్పిన 3132 కంటే వంద రెట్లు ఎక్కువ పీపీఈలు మా దగ్గర ఉన్నాయి.. ఇది అవమానకరమైన జర్నలిజం’ అంటూ ఇండియా టుడే ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు ట్యాగ్ చేస్తూ కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణలో ప్రస్తుతం 3.6 లక్షలకుపైగా పీపీఈ కిట్స్ ఉన్నాయని.. ఇంకా 6 లక్షల పీపీఈలు స్టాక్స్ తెప్పిస్తున్నామని.. అవి తర్వలోనే అందుతాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని వారాల క్రితమే ఈ స్టాక్ ను అధికారికంగా విడుదల చేసింది.
తెలంగాణలో దేశంలోనే తక్కువ ఉన్నాయని చెప్పిన ఇండియా టుడేను ఇప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిరాదారమైన వార్తలు వేస్తారా అని నెటిజన్లు కడిగిపారేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి నకిలీ వార్తలు తీస్తేస్తారని.. ఆ మర్యాద మీకు ఉంటుందని నేను అనుకుంటున్నానని కేటీఆర్ బాగానే కౌంటర్ ఇచ్చారు.