కేఏ పాల్ ఆస్తుల లెక్క తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే

Update: 2019-03-27 05:27 GMT
గెలుపు సంగ‌తి త‌ర్వాత‌.. ఏపీ ఎన్నిక‌ల్లో అనునిత్యం వార్త‌ల్లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తున్నారు ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఆయ‌న మాట‌లు.. చేష్ట‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. వాడివేడి వాతావ‌ర‌ణాన్ని కాస్తంత కూల్ చేస్తుంద‌ని చెప్పాలి. ఎన్నిక‌ల బ‌రిలో త‌న స‌త్తా చాటుతాన‌ని.. తాను ఏపీకి కాబోయే సీఎంన‌ని చెప్పే కేఏ పాల్ నామినేష‌న్ వ్య‌వ‌హారం నాట‌కీయ మ‌లుపులు తిరిగింది.

తాజాగా ఆయ‌న దాఖ‌లు చేసిన నామినేష‌న్ కు ఎన్నిక‌ల సంఘం ఓకే చెప్పింది. ఇక‌.. ఆయ‌న ఆస్తుల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూశాయి. త‌న పేరుతో ఎలాంటి ఆస్తులు లేవ‌ని.. ఉన్న ఆస్తుల్ని ఛారిట‌బుల్ ట్ర‌స్టుకు ఇచ్చిన‌ట్లుగా చెప్పారు. కేఏ పాల్ కు సొంత హెలికాఫ్ట‌ర్ ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది.

అయితే.. త‌న హెలికాఫ్ట‌ర్ ను.. త‌న‌కున్న ఆస్తుల్ని ఛారిట‌బుల్ ట్ర‌స్టుకు ఇచ్చేసిన‌ట్లుగా ఆయ‌న వెల్ల‌డించారు. త‌న పేరుతో సొంత సైకిల్ కూడా లేదని చెప్పిన ఆయ‌న‌.. అప్పుల విష‌యంలో మాత్రం కాసిన్ని ఉన్న‌ట్లు చెప్పారు. క్రెడిట్ కార్డు బ‌కాయిలు 2 వేల అమెరిక‌న్ డాల‌ర్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో త‌న భార్య పేరు మీద మ‌రో వెయ్యి డాల‌ర్లు బ‌కాయిలు ఉన్న‌ట్లుగా తెలిపారు. కేఏ పాల్ లాంటి పెద్ద మ‌నిషికి సొంతంగా ఎలాంటి ఆస్తులు లేవ‌న్న స‌మాచారం అవాక్కు అయ్యేలా చేస్తోంది. 
Tags:    

Similar News