కేఏ పాల్ వచ్చాడు.. లొల్లి షూరూ చేశాడు!

Update: 2021-04-29 12:36 GMT
పాఫం పాల్.. అమెరికాలో ఇన్నాళ్లు సేదతీరి.. ఇప్పుడు మండే ఎండల్లో అదీ కరోనా టైంలో ఏపీలో రోడ్డునపడ్డాడు. ఏపీలోని సమస్యలపై పోరుబాటకు శ్రీకారం చుట్టాడు.అప్పట్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేఏ పాల్ చేసిన రాజకీయ హంగామా అంతా ఇంతాకాదు.. ఆ వేడిలో కామెడీ చేసి అందరినీ సేదతీర్చాడు. అచ్చం వైసీపీని పోలిన రంగును, గుర్తును తెచ్చుకొని జగన్ టార్గెట్ గా రాజకీయం చేశాడు.కానీ బ్యాడ్ లక్.. పాపం.. కేఏ పాల్ ఓడిపోయాడు.ప్రజాశాంతి పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు సాధించకుండా చాపచుట్టేసింది. దీంతో పాల్ కూడా మూటముల్లె సర్దేసి అమెరికా ఫ్లైట్ ఎక్కాడు.

ఇప్పుడు ఇన్నాళ్లుగా గుర్తుకురాని ఏపీ సమస్యలు సడెన్ గా గుర్తుకు వచ్చేసరికి మళ్లీ ఏపీలో ప్రత్యక్షమ్యాడు పాల్. తాజాగా కరోనా సెకండ్ వేవ్ వేళ పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం సరికాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని ఏకంగా విశాఖలో నిరసన కూడా చేపట్టాడు.

ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు ఇలా ఎండలో మాడుతూ దీక్ష కొనసాగిస్తానని పాల్ ప్రతిన బూనారు.పరీక్షలపై హైకోర్టులో పిటీషన్ వేశానని.. రేపు వాదనలు జరుగుతాయని కేఏ పాల్ తెలిపారు. పరీక్షలు రద్దు చేయమని అడగట్లేదని.. రెండు నెలలు వాయిదా వేయాలని కోరుతున్నానని తెలిపారు.
Tags:    

Similar News