కేఏ పాల్ ఈఎంఐ క‌ట్ట‌లేక‌పోతున్నారా?

Update: 2022-04-25 08:31 GMT
ప్ర‌పంచ దేశాధినేత‌లు త‌న అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తార‌ని.. తాను చెబితే త‌ప్ప ఏ ప‌ని చేయ‌ర‌ని గొప్ప‌లు చెప్పుకునే కేఏ పాల్ త‌న ఇంటికి ఈఎంఐ కూడా క‌ట్టుకోలేక‌పోతున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. రాజ‌కీయాల గురించి.. త‌న గురించి కోట‌లు దాటేలా మాట‌లు చెప్పే ఆయ‌న‌.. ఇప్పుడు అమెరికాలో నివ‌సిస్తున్న ఇంటి మోగ‌జ్ (రుణం) క‌ట్ట‌లేక‌పోతున్నార‌ని స‌మాచారం.  అత‌ని కుటుంబ స‌భ్యులు డ‌బ్బులు సంపాదించి ఆ మోగ‌జ్ క‌డుతున్నార‌ని తెలిసింది.

ప్ర‌జాశాంతి పార్టీతో గ‌త ఏపీ ఎన్నిక‌ల్లో హ‌డావుడి చేసి ఇప్పుడు సైలెంట్ అయిపోయిన కేఏ పాల్ పాలిటిక్స్‌లో జోక‌ర్‌గా మారార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ అభ్య‌ర్థుల డేటా ఉన్న కంప్యూట‌ర్ కాలిపోయింద‌నే కార‌ణంతో పోటీ నుంచి త‌ప్పుకున్న ఆయ‌న చెప్పే మాట‌ల‌కు మాత్రం అంతుపొంతు ఉండ‌డం లేదు.

తెలుగు రాష్ట్రాల‌కు ఆయ‌న కామెడీ పీస్‌గా మారిపోయార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీని కూడా మాట‌ల్లోకి లాగి మ‌రింత అప‌హాస్యం పాల‌వుతున్నారు. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ బ‌లంగా ఉంది. మ‌రోవైపు కాంగ్రెస్‌, బీజేపీ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ టీఆర్ఎస్ గెలిచే అవ‌కాశాలు ఉన్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు కేవ‌లం 30 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని ప్రశాంత్ కిషోర్ త‌న‌కు చెప్పార‌ని కేఏ పాల్ అంటున్నారు. ఏపీలో జ‌గ‌న్‌, తెలంగాణ‌లో కేసీఆర్‌, కేంద్రంలో ప్ర‌ధాని మోడీ త‌న ఆశీర్వాదాలు తీసుకున్నార‌ని పాల్ చెప్పారు. అంతే కాకుండా త‌న‌కు రాజ్య‌స‌భ సీటు ఇచ్చి డిప్యూటీ పీఎంను చేస్తానంటే తానే వ‌ద్ద‌న్నాన‌ని కామెడీ మాట‌లు మాట్లాడుతున్నారు. ఎంత‌సేపు ఏదో ఒక‌టి మాట్లాడి మీడియాను ఆకర్షించాలనేది ఆయ‌న ల‌క్ష్య‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇక త‌న ఛారిటీ ద్వారా రూ.7500 కోట్లు ఖ‌ర్చు పెడ‌తా అని చెప్పే ఆయ‌న ఇప్పుడు ఇంటికి మాత్రం ఈఎంఐ క‌ట్ట‌లేక‌పోతున్నారు. అమెరికాలో పాడుప‌డ్డ ఇంట్లో ఊంటూ లైవ్ వీడియోలు యూట్యూబ్‌లో పెడుతూ దానిమీద వ‌చ్చే ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం మీద ఆధార‌ప‌డి ఆయ‌న జీవిస్తున్నార‌ని టాక్‌. ఈ విష‌యాన్ని ఆయ‌న మ‌నుషులే ప్ర‌చారం చేస్తున్నార‌ని తెలిసింది. అలాంటి ప‌రిస్థితుల్లో ఇల్లు అప్పునే క‌ట్ట‌లేనివాడు.. ఇక ఈ వ్య‌ర్థం మాట‌లు చెప్ప‌డం ఎందుకు? అనే విమ‌ర్శ‌లు ఆయ‌న‌పై వ‌స్తున్నాయి. అయినా కేఏ పాల్ పంథా మాత్రం మార‌ద‌ని అంటున్నారు.
Tags:    

Similar News